Cholesterol Control Fruits: ఆ 5 పర్పుల్ రంగు పండ్లు తింటే కొలెస్ట్రాల్ పూర్తిగా మటుమాయం

Cholesterol Control Fruits: కొలెస్ట్రాల్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. ఒక్క కొలెస్ట్రాల్ కారణంగా వివిధ రకాల వ్యాధులు ఎదురౌతాయి. మధుమేహం, రక్తపోటు, గుండె వ్యాధులకు కారణంగా కొలెస్ట్రాల్ కావచ్చు. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 14, 2024, 01:57 PM IST
Cholesterol Control Fruits: ఆ 5 పర్పుల్ రంగు పండ్లు తింటే కొలెస్ట్రాల్ పూర్తిగా మటుమాయం

Cholesterol Control Fruits: కొలెస్ట్రాల్ అనేది ఆహారపు అలవాట్లను బట్టి ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించాలంటే ముందుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా డైట్‌లో 5 రకాల పండ్లను చేర్చితే కొలెస్ట్రాల్ చాలా సులభంగా తగ్గుతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

మనిషి ఆరోగ్యం అనేది ఆ వ్యక్తి గుండె ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డీఎల్ ఒకవేళ రక్త నాళాల్లో పేరుకుపోయుంటే రక్త సరఫరాలో ఆటంకం కలుగుతుంది. దాంతో గుండె వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఎల్‌డీఎల్ అనేది చాలా ప్రమాదకరం. ఇది తగ్గించాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కొన్ని రకాల పండ్లు డైట్‌లో చేర్చుకోవాలి. వీటిలో ఏంథోసయానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ సులభంగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా వంకాయ రంగు ఫ్రూట్స్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో కీలకభూమిక పోషిస్తాయి. 

ప్లమ్ అనేది తీపిగా ఉండే లిక్విడ్ ఫ్రూట్. ఇందులో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పెద్దమొత్తంలో ఉంటుంది. ప్లమ్‌లో కూడా ఏంధోసయానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో దోహదపడుతుంది. నేరేడు పండ్లు కూడా చాలా మంచివి. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇందులో కూడా ఫైబర్, విటమిన్ సి పెద్దమొత్తంలో ఉంటాయి. సీజన్‌లో రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ వేగంగా కరుగుతుంది. 

అంజీర్ మరో అద్భుతమైన ఫ్రూట్. ఇందులో కూడా ఫైబర్, పొటాషియం పెద్దమొత్తంలో లభిస్తుంది. వివిధ అధ్యయనాల ప్రకారం అంజీర్ రోజూ తినడం వల్ల ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా హెచ్‌డీఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బ్లాక్ బెర్రీ అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యపరంగా అధిక లాభాలిచ్చే ఫ్రూట్. ఇందులో ఫైబర్, మాంగనీస్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఇందులో ఏంథో సయానిన్ కారణంగా ఎల్‌డీఎల్ తగ్గించవచ్చు. హెచ్‌డీఎల్ పెంచుకోవచ్చు.

ఇక ఐదవ ఫ్రూట్ బ్లూ బెర్రీ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. విటమిన్ సి, ఫైబర్ కూడా పెద్దమొత్తంలో ఉంటాయి. రోజూ నియమిత రూపంలో బ్లూ బెర్రీ పండ్లు తినడం వల్ల ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు. 

Also read: Platelet Count: డెంగ్యూ రోగులకు ఈ 5 పండ్లు దివ్య ఔషధంతో సమానం, ప్లేట్‌లెట్ కౌంట్ పెంచే అద్భుత మార్గం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News