Cholesterol Remedies: కొలెస్ట్రాల్ అనేది మనిషి ఆరోగ్యంపై అత్యంత దారుణంగా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. సకాలంలో కొలెస్ట్రాల్ సమస్య తగ్గించకుంటే దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా రక్తపోటు, గుండె వ్యాధులు, కిడ్నీ సమస్య ఉత్పన్నం కావచ్చు. ట్యాబ్లెట్స్ వాడటం కంటే చిట్కాలు పాటించడం ద్వారా కొలెస్ట్రాల్ వేగంగా నిర్మూలించవచ్చు.
మనం తీసుకునే ఆహార పదార్ధాలు, జీవనశైలి రక్త నాళాల్లో కొలెస్ట్రాల్‌కు కారణమౌతుంది. రక్త నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. రక్త నాళాల్లో బ్లాకేజ్ కావడం వల్ల హార్ట్ ఎటాక్ వంటి వ్యాధులు ఎదురుకావచ్చు. కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసెల్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటిస్ ముప్పు రావచ్చు. అందుకే కొలెస్ట్రాల్ సమస్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని రకాల పదార్ధాలు క్రమం తప్పకుండా తినడం వల్ల ఈ సమస్యను దూరం చేయవచ్చు. ఇందులో ముఖ్యమైంది ఉసిరి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉండటం వల్ల కొలెస్ట్రాల్ చాలా వేగంగా తగ్గించవచ్చు. దీనికోసం రోజుకు రెండు ఉసిరికాయలు తప్పకుండా తినాలి.
రక్త నాళాల్లో పేరుకునే కొలెస్ట్రాల్ తగ్గించే మరో అద్భుత మార్గం సోంపు. సోంపును చాలామంది మౌత్ ఫ్రెష్నర్ మాత్రమే అనుకుంటారు. కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించేందుకు సోంపు అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ రాత్రి సమయంలో గ్లాసు నీటిలో సోంపు నానబెట్టి ఉదయం సేవించాలి. ఇక మూడవది పసుపు. సాధారణంగా వంటల్లో రుచి కోసం వాడుతారు. కానీ పసుపును నిర్ణీత పద్ధతిలో వాడితే కొలెస్ట్రాల్ అద్భుతంగా తగ్గించవచ్చు. గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి రోజూ తాగాల్సి ఉంటుంది.
అల్లంకు ఆయుర్వేదపరంగా చాలా ప్రాధాన్యత ఉంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్త నాళాల్లో పేరుకునే కొలెస్ట్రాల్ వేగంగా కరుగుతుంది. ఇక ఆయుర్వేదపరంగా మరో అద్భుతమైన పదార్ధం వెల్లుల్లి. రోజుకు 2-3 వెల్లుల్లి రెమ్మలు తింటే కొలెస్ట్రాల్ చాలా సులభంగా నిర్మూలించవచ్చు.
Also read: Diabetes Remedies: డయాబెటిస్‌కు రక్తపోటుకు సంబంధమేంటి, ఎలా నియంత్రించాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.