ప్రతి భారతీయ కిచెన్‌లో తప్పకుండా కన్పించే కొన్ని మసాలా దినుసులతో మీ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా సంరక్షించుకోవచ్చు. ఇందులో ముఖ్యమైంది లవంగం. లవంగంతో కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..
లవంగం అనేది కేవలం ఆహార పదార్ధాల రుచిని పెంచేందుకే కాదు. ఇందులో ఆరోగ్యపరంగా అద్భుత ప్రయోజనాలున్నాయి. లవంగంతో వంటల రుచి, సువాసన పెరుగుతుంది. అదే సమయంలో పలు రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. ఉదయం పరగడుపున లవంగాన్ని నీళ్లలో ఉడకబెట్టి ఆ నీరు తాగితే..ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. లవంగంలో ఫైబర్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఉదయం వేళ లవంగం నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చూద్దాం.
లవంగం నీళ్లతో ఉపయోగాలు
లవంగంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. ఫలితంగా స్వెల్లింగ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. లవంగంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హానికారకమైన కణాలతో పోరాడేందుకు దోహదం చేస్తాయి. అందుకే జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, కడుపు నొప్పి సమస్యల్ని దూరం చేయడంలో ఉపయోగపడుతుంది.
బ్లడ్ షుగర్ నియంత్రణ
లవంగం నీళ్లు తాగడం వల్ల ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం తాగడం వల్ల డయాబెటిస్ రోగులకు అద్భుత ప్రయోజనం కలుగుతుంది.
జీర్ణక్రియ మెరుగుదల
ఉదయం లవంగం ఉడికించిన నీళ్లు తాగితే...జీర్ణ సంబంధిత తలెత్తవు. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల గ్యాస్, మలబద్ధకం, అజీర్తి సమస్యలు దూరమౌతాయి.
లవంగం నీళ్లను తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్ధాలు, హానికారకాలు, అవశేషాలు బయటకు వచ్చేస్తాయి. శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
Also read: Guava Benefits: మలబద్ధకం సహా అన్ని సమస్యలకు అద్భుత ఔషధమిదే, కేవలం మూడ్రోజుల్లో మటుమాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook