Coconut Benefits: కొబ్బరి నీళ్లు అమృతంతో సమానమంటారు పెద్దలు. కొబ్బరి నీళ్లు నిజంగానే అద్భుత ఔషధంతో సమానం. వేసవిలోనే కాదు..వర్షాకాలంలో కూడా మంచిది. ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెడతాయి. ఆ వివరాలు మీ కోసం..
వేసవికాలం, వర్షకాలం, చలికాలం..సీజన్ ఏదైనా సరే కొబ్బరి నీళ్లు అద్భుత ఔషధం అనడంలో సందేహం లేదు. సాధారణంగా ఎక్కువమంది వేసవికాలంలో తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. మిగిలిన సీజన్లలో పట్టించుకోరు. కానీ వర్షాకాలంలో కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే వర్షకాలంలో ఎదురయ్యే వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లకు కొబ్బరి నీళ్లు చెక్ పెడతాయి.
వేసవిలోనే కాదు..ఏ సీజన్‌లో అయినా బాడీ ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండాలి. శరీరం అంతర్గత ఉష్ణోగ్రత చల్లగా ఉండాలి. అంతర్గతంగా ఉండే వేడిని చల్లార్చుకోవడమే కాకుండా..బాడీ ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచడం మంచిది. లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనికి ప్రత్యామ్నాయం కొబ్బరి నీళ్లు. ఏ సీజన్ అయినా కొబ్బరి నీళ్లకు మించింది లేదు.
ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, కొబ్బరి నీళ్లు తీసుకోవడమే అత్యుత్తమ మార్గం. చల్లగా తాగాలన్పించినా సరే ఖర్బూజ, తర్బూజ, కొబ్బరి నీళ్లనే అలవాటు చేసుకోవాలి. వీటివల్ల శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. కొబ్బరినీటిలో సహజ సిద్ధమైన విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లతో కడుపులో మంట, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమౌతాయి. కొబ్బరినీటిలో ఉండే పొటాషియం, సోడియం అల్కలైన్ కారణంగా రక్తపోటు తగ్గతుంది. కొబ్బరినీళ్లు..సహజమైన ఎలక్ట్రోలైట్‌గా ..రిఫ్రెష్‌గా..హైడ్రేడెట్‌గా ఉంచుతాయి.
వర్షాకాలం ఇన్‌ఫెక్షన్లకు చెక్
కొబ్బరినీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఎసిటమైనోపెన్ కారణంగా కాలేయం మెరుగ్గా ఉంటుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు మాత్రం తక్కువ మోతాదులో తీసుకోవాలి. కొబ్బరినీళ్లతో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఏ రకమైన ఇన్‌ఫెక్షన్స్ దరిచేరవు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించుకోవాలంటే..కొబ్బరినీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. కొబ్బరినీళ్లలో ఉండే కాల్షియం కారణంగా ఎముకలు, దంతాలు ధృడంగా ఉంటాయి.
వృద్ధాప్య చాయలు దూరం
కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. వ్యాయామం తరువాత పండ్ల రసాలు తీసుకోవడం కంటే..కొబ్బరినీళ్లు తీసుకోవడం అత్యుత్తమం. కొబ్బరిలో 95 శాతం నీరుండటం వల్ల నీటి కొరత తలెత్తదు. వివిధ రకాల వ్యాధులతో బాధపడేవారు, తరచూ వైరల్ ఇన్‌ఫెక్షన్స్‌కు గురయ్యేవారు కొబ్బరినీళ్లను తీసుకుంటే మంచి ప్రయోజనాలుంటాయి.
Also read: Black Coffee Benefits: బెడ్ కాఫీ వద్దు..బ్లాక్ కాఫీ ముద్దు, బ్లాక్ కాఫీతో వృద్ధాప్య ఛాయలు మటుమాయం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Coconut Benefits: వేసవిలోనే కాదు..వర్షాకాలంలోనూ మంచిదే,వర్షాకాలం ఇన్‌ఫెక్షన్లకు చెక్