Lungs Cancer Symptoms: ఎటుచూసినా పొగచూరిన వాతావరణం. నిండా కాలుష్యం. అందుకే అనారోగ్య సమస్యలు అధికమౌతున్నాయి. ఊపిరితిత్తుల సమస్యలు..ముఖ్యంగా లంగ్ కేన్సర్ ప్రధాన సమస్యగా మారింది. లంగ్ కేన్సర్‌ను ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం.
ప్రపంచాన్ని ఇప్పటికీ శాసిస్తున్నది, పీడిస్తున్నది ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి. మనిషిని నిలువునా కృశింపచేసి..ప్రాణం తీస్తుంది. చాలా రకాల కేన్సర్‌లు ఉన్నా..ఊపిరితిత్తుల కేన్సర్ చాలా ప్రమాదకరమైందిగా ఉంది. ఎందుకంటే చాలా త్వరగా వ్యాపిస్తుంది. అందుకే మీ ఊపిరితిత్తుల్ని ఎల్లప్పుడూ సంరక్షణ చేసుకోవడం చాలా మంచిది. అసలు ఊపిరితిత్తుల కేన్సర్ ఎలా వచ్చిందో కొన్ని సులభమైన లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో పరిశీలిద్దాం.
గోర్లలో మార్పులు
ఊపిరితిత్తుల కేన్సర్ సోకితే..ఆ వ్యక్తుల వేలి గోర్లు విచిత్రంగా ఆకారం మారతాయి. ఉబ్బెత్తుగా, విభిన్నమైన ఆకారంలో ఉంటాయి. వేళ్ల పైభాగం ఎఫెక్ట్ అవుతుంది. కాలిగోర్లతో కూడా మార్పు వస్తుంది. ఫింగర్ క్లబ్ జరిగితే ఊపిరితిత్తుల కేన్సర్‌గా నిర్ధారణ చేయవచ్చు. ఫింగర్ క్లబ్ వల్ల కేన్సర్ సోకిందని చెప్పవచ్చంటున్నారు పరిశోధకులు., గోర్లు మృదువుగా మారడం లేదా లేచినట్టు అన్పించడం కేన్సర్ లక్షణాలే.
ఇక ఊపిరితిత్తుల కేన్సర్‌కు ఇంకొన్ని ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. తరచూ దగ్గు ఎక్కువగా ఉండటం, ఛాతీలో నొప్పి ప్రధాన లక్షణాలు. శ్వాస తీసుకోవడంలో తరచూ ఇబ్బంది ఎదుర్కోవడం, దగ్గుతున్నప్పుడు రక్తం కారడం, తీవ్రమైన అలసట, బరువు విపరీతంగా తగ్గడం కేన్సర్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఊపిరితిత్తుల కేన్సర్ సమస్యను రక్షించుకోవాలంటే..ముందుగా ధూమపానానికి దూరంగా ఉండాలి. చుట్టుపక్కల ఎవరైన ధూమపానం చేస్తుంటే దూరంగా ఉండండి. ఎందుకంటే పాసివ్ స్మోకింగ్ కూడా డేంజర్. ఇక పనులు చేసేటప్పుడు కార్సినోజెన్స్‌కు దూరంగా ఉండాలి. సిమెంట్, దుమ్ము, ధూళికి దూరంగా ఉంటే మంచిది. నిత్య జీవితంలో ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమం తప్పని వ్యాయామం కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
Also read: World Sleep Day: నేడు ప్రపంచ నిద్ర దినోత్సవం.. ఏఐజీ సర్వేలో ఆసక్తికర విషయాలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook