Coconut Benefits: కొబ్బరినీళ్లతో కలిగే అద్బుత ప్రయోజనాలు, బరువు తగ్గేందుకు కూడా

Coconut Benefits: కొబ్బరినీళ్లంటే సాధారణంగా వేసవిలో మాత్రమే అనే భావన ఉంటుంది. కానీ కొబ్బరి నీళ్లు ఎప్పుడూ ఆరోగ్యానికి మంచివే. మెరుగైన ఆరోగ్యంతో పాటు స్థూలకాయానికి చెక్ పెట్టాలంటే కొబ్బరినీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 26, 2022, 10:40 PM IST
Coconut Benefits: కొబ్బరినీళ్లతో కలిగే అద్బుత ప్రయోజనాలు, బరువు తగ్గేందుకు కూడా

Coconut Benefits: కొబ్బరినీళ్లంటే సాధారణంగా వేసవిలో మాత్రమే అనే భావన ఉంటుంది. కానీ కొబ్బరి నీళ్లు ఎప్పుడూ ఆరోగ్యానికి మంచివే. మెరుగైన ఆరోగ్యంతో పాటు స్థూలకాయానికి చెక్ పెట్టాలంటే కొబ్బరినీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి.

సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతి సీజన్‌లోనూ తీసుకోవచ్చు. మెరుగైన ఆరోగ్యం కోసమైతే అనివార్యం కూడా. కొబ్బరి నీళ్లనగానే చాలామంది వేసవిలోనే కదా అనుకుంటారు. కానీ అది తప్పు. కొబ్బరినీళ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. అందుకే ఏ సీజన్‌లో అయినా తీసుకోవల్సిందే. వేసవిలో ఎక్కువగా చల్లదనం కోసం లేదా దాహం తీర్చుకునేందుకు కొబ్బరినీళ్లు తాగుతుంటారు. వేసవిలో బాడీ హైడ్రేట్‌గా ఉంచేందుకు కొబ్బరినీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే వేసవిలో ఎక్కువగా కొబ్బరినీళ్లకు డిమాండ్ ఉంటుంది. 

ప్రకృతి లభించే పండ్లు, కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు కొబ్బరి నీళ్లకు మించింది లేదు. కొబ్బరినీళ్లలో పుష్కలంా లభించే విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి నీళ్లతో కడుపులో మంట, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమౌతాయి. కొబ్బరినీటిలో ఉండే పొటాషియం, సోడియం అల్కలైన్ కారణంగా రక్తపోటు తగ్గతుంది. కొబ్బరినీళ్లు..సహజమైన ఎలక్ట్రోలైట్‌గా ..రిఫ్రెష్‌గా..హైడ్రేడెట్‌గా ఉంచుతాయి. 

కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. వ్యాయామం తరువాత పండ్ల రసాలు తీసుకోవడం కంటే..కొబ్బరినీళ్లు తీసుకోవడం అత్యుత్తమం. కొబ్బరిలో 95 శాతం నీరుండటం వల్ల నీటి కొరత తలెత్తదు. వివిధ రకాల వ్యాధులతో బాధపడేవారు, తరచూ వైరల్ ఇన్‌ఫెక్షన్స్‌కు గురయ్యేవారు కొబ్బరినీళ్లను తీసుకుంటే మంచి ప్రయోజనాలుంటాయి.

బరువు తగ్గేందుకు కొబ్బరి నీళ్లు

కొబ్బరినీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఎసిటమైనోపెన్ కారణంగా కాలేయం మెరుగ్గా ఉంటుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు మాత్రం తక్కువ మోతాదులో తీసుకోవాలి. కొబ్బరినీళ్లతో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఏ రకమైన ఇన్‌ఫెక్షన్స్ దరిచేరవు. కొబ్బరినీళ్లలో ఉండే కాల్షియం కారణంగా ఎముకలు, దంతాలు ధృడంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లనేవి కేవలం వేసవిలో హైడ్రేట్‌గా ఉంచడమే కాదు..బరువు తగ్గేందుకు కూడా దోహదపడుతాయి.

Also read: Cholesterol Symptoms: మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందో లేదో చెప్పేస్తాయి ఈ లక్షణాలు, తస్మాత్ జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News