Natural Tips To Control High Cholesterol: అధిక కొలెస్ట్రాల్ ఎంత ప్రమాదకరమైనదో అందరికీ తెలిసిందే..అంతేకాకుండా దీని కారణంగా ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో పేరుకుపోతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చా?:
శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను సులభంగా జీవనశైలి, ఆహారాల్లో మార్పులు చేర్పులు చేయడం వల్ల సులభంగా నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీరంలో కొవ్వును తగ్గించడానికి మార్కెట్‌లో చాలా రకాల ఔషధాలు ఉన్నప్పటికీ సాధరణ ఇంటి చిట్కాలతో నియంత్రించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది:
అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి రోజు ఆహారాల్లో వేయించిన, ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన, స్పైసీ ఫుడ్స్, షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు రెట్టింపయ్యే ఛాన్స్ కూడా ఉంది.
వ్యాయామాలు తప్పని సరి:
శరీరానికి తగిన శ్రమ లేకపోతే చాలా రకాల వ్యాధుల వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజు అరగంట పాటు వ్యాయామాలు లేదా వాకింగ్ చేయడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీలైతే రోజుకు రెండు సార్లు వ్యాయామాలు చేయడం చాలా మంచిది.
శరీర బరువును నియంత్రించుకోవాలి:
ప్రస్తుతం చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. దీని కారణంగా అధిక కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారు. దీంతో సులభంగా బరువు పెరుగుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీర బరువును నియంత్రించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ఫైబర్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook