Cucumber Benefits: ప్రతి రోజు కీర దోసకాయను తినడం వల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. ఇందులో తక్కువ కేలరీలు, ఎక్కువ నీరు లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఉదయం తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్స్, ఖనిజాలు కూడా లభిస్తాయి. ఇవి పొట్టను ఆరోగ్యంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు దోసలో ఉండే గుణాలు ఇతర దీర్ఘకాలిక వ్యాధులను కూడా దూరంగా చేస్తాయి. అయితే దీనిని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు నియంత్రిస్తుంది:
కీర దోసకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో నీరు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరానికి అవసరమైన నీటిని అందించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
హైడ్రేషన్:
కీర దోసకాయలో 96% నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా దీనిని ఎండ కాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
చర్మ ఆరోగ్యం కోసం:
కీర దోసకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని వివిధ రకాల రోగాల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా ముడతలు, మచ్చలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే చర్మాన్ని మృదువుగా, మెరిసిపోయేలా చేయడానికి సహాయపడుతుంది.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది:
కీర దోసకాయలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దోసకాయలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
గుండె ఆరోగ్యం కోసం:
కీర దోసకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దోసకాయలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.