Curd Drinks Facts: రోజు పెరుగు తాగితే ఈ 5 రకాల వ్యాధులు హామ్‌ ఫట్!

Curd Drinks Facts: రోజు పెరుగు తినడం కంటే తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే ఎముకలు కూడా దృఢంగా మారుతాయి.    

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 30, 2024, 02:22 PM IST
Curd Drinks Facts: రోజు పెరుగు తాగితే ఈ 5 రకాల వ్యాధులు హామ్‌ ఫట్!

Curd Drinks Facts In Telugu: పెరుగు అన్నం చాలా మంది తింటూ ఉంటారు. నిజానికి పెరుగు అన్నం తినడం కంటే పెరుగును తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో అన్నంలో కార్బోహైడ్రేట్స్‌ అధికంగా ఉంటాయి. కాబట్టి పెరుగుతో తీసుకోవడం వల్ల కొన్ని లాభాలే కలుగుతాయి. అదే నేరుగా పెరుగు తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్‌ నేరుగా శరీరానికి లాభిస్తాయి. దీంతో పెరుగు తాగడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. రోజు పెరుగు తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.

పెరుగు తాగడం వల్ల కలిగే లాభాలు:
జీర్ణవ్యవస్థ మెరుగు: 

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియను ఆరోగ్యంగవంతంగా ఉంచుతుంది. కాబట్టి ప్రతి రోజు పెరుగు తినడం కంటే తాగడం వల్ల ఎక్కువ లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఇది జీర్ణ సమస్యలను తగ్గించి.. మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలను నివారిస్తుంది.

రోగ నిరోధక శక్తి పెంచేందుకు: 
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ గుణాలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి పెరుగును రోజు తాగడం వల్ల సీజనల్‌ వ్యాధుల నుంచి ఉపశమనం కలగడమే కాకుండా అంటువ్యాధుల నుంచి రక్షిస్తుంది.

ఎముకల ఆరోగ్యం: 
పెరుగులో కాల్షియంతో పాటు ఇతర పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. దీంతో పాటు ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదకరమైన ఎముకల వ్యాధులను కూడా సులభంగా నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

చర్మ ఆరోగ్యం: 
పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని తేమగా చేసేందుకు కూడా అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి రోజు పెరుగును తాగడం వల్ల చర్మం ఎంతో మృదువుగా మారుతుంది. దీంతో పాటు మొటిమలు, ఇతర చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. 

Also read: DSC: మెగా డీఎస్సీకి ముహూర్తం ఫిక్స్‌.. 16,347 ఉద్యోగాల భర్తీకి ఆరోజే నోటిఫికేషన్‌ రిలీజ్‌..!

బరువు నియంత్రణ: 
పెరుగులో ప్రోటీన్‌ కూడా ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి రోజు తాగడం వల్ల ఆకలిని తగ్గించి, జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Also read: DSC: మెగా డీఎస్సీకి ముహూర్తం ఫిక్స్‌.. 16,347 ఉద్యోగాల భర్తీకి ఆరోజే నోటిఫికేషన్‌ రిలీజ్‌..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News