Dengue Alert: వర్షాకాలంతో పాటే డెంగ్యూ వచ్చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు పెరుగుతున్న పరిస్థితి. ప్రాణాంతకమైన డెంగ్యూ ప్రబలుతున్న నేపధ్యంలో..డెంగ్యూ లక్షణాలేంటి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం..
వర్షాకాలం ప్రారంభమై అప్పుడే రెండో నెల. వర్షాల తీవ్రత పెరిగే కొద్దీ..డెంగ్యూ, మలేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలే కన్పిస్తున్నాయి. ప్రాణాంతక డెంగ్యూ వైరస్ కేసులు ఎక్కువౌతున్నాయి.
డెంగ్యూ వస్తే ఏమౌతుంది, లక్షణాలేంటి
గత కొద్దిరోజులుగా డెంగ్యూ వ్యాధి విస్తరణ ఎక్కువవుతోంది. డెంగ్యూ వచ్చిందంటే చాలు ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా తగ్గిపోయి ప్రాణాంతకంగా మారుతుంది. డెంగ్యూలో ప్లేట్లెట్ కౌంట్ అనేది చాలా ముఖ్యమైనది. డెంగ్యూ కాకుండా ఇతరత్రా వ్యాధుల్లో కూడా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతుంది కానీ..డెంగ్యూలో శరవేగంగా తగ్గుదల కన్పిస్తుంది. తీవ్రమైన జ్వరం, ట్యాబ్లెట్ వేసినా తగ్గకపోవడం, తలనొప్పి, కడుపు నొప్పి, తీవ్రమైన నీరసం ప్రధాన లక్షణాలు.
ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉండాలి
డెంగ్యూలో గంట గంటకూ కౌంట్ పడిపోతుంటుంది. వెంటనే ప్లేట్లెట్ కౌంట్ తగ్గినప్పుడు రోగికి రక్తస్రావం లేదా అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశముంటుంది. అటువంటప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. సాధారణంగా ఆరోగ్యవంతుడైన మనిషి శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య 3- 4 లక్షల వరకూ లేదా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది 80 వేల వరకూ పడిపోయినా ఎటువంటి నష్టం లేదు. కానీ 20 వేలకంటే దిగువకు పడిపోయినప్పుడు మాత్రం ప్రమాదకరంగా భావిస్తారు. రోగి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది.
ఈ పరిస్థితుల్లో వెంటనే అదే గ్రూప్ బ్లడ్‌గ్రూప్‌కు సంబంధించి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. బ్లడ్ బ్యాంకులోల దాతలిచ్చిన రక్తంలో ఉండే మూడు అంశాల్ని వేరుచేస్తారు. ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను విడదీసి..వేర్వేరుగా ప్యాక్ చేస్తారు. ప్లేట్లెట్స్ అవసరమైనవారికి ఎక్కిస్తుంటారు.
ప్లేట్లెట్ కౌంట్ పెంచే అద్భుతమైన చిట్కా
దీంతో పాటు సహజ పద్దతిలో అందరికీ తెలిసిన మరో పద్థతి ఉంది. తక్షణం శరీరంలో ప్లేట్లెట్స్ కౌంట్‌ను పెంచుతుంది. బొప్పాయి చెట్టు లేత ఆకుల రసం. ఇది చాలా సులభం. లేత ఆకుల్నించి ఎప్పటికప్పుడు కొద్దిగా రసాన్ని సేకరించాలి. 5 ఎంఎల్ నుంచి 10 ఎంఎల్ వరకూ ప్రతిరోజూ ఉదయం , రాత్రి తీసుకుంటే చాలా వేగంగా ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. ఇతర మందులు వాడుతూ కూడా ఈ రసం తీసుకోవచ్చు. ప్లేట్లెట్స్ కౌంట్ పెరగడానికి అద్భుతమైన హోమ్ రెమెడీ ఇది.
Also read: Stones in Body: కిడ్నీతోపాటు శరీరంలో రాళ్లు ఉండే భాగాలేవి, లక్షణాలెలా ఉంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook