Diabetes Control Tips: డయాబెటిస్‌కు ఆ పండు చాలా డేంజర్, కానీ ఆకులు మాత్రం అద్భుతమైన ఔషధమే

Diabetes Control Tips: దేశంలో ఎక్కడ చూసినా మధుమేహం ప్రమాదం ఎక్కువగా కన్పిస్తోంది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధిగా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం ప్రపంచ జనాభాలో 5-7 శాతం మందికి మధుమేహం ఉంది. మధుమేహానికి చికిత్స లేకున్నా..నియంత్రణ పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 8, 2023, 07:25 PM IST
Diabetes Control Tips: డయాబెటిస్‌కు ఆ పండు చాలా డేంజర్, కానీ ఆకులు మాత్రం అద్భుతమైన ఔషధమే

Diabetes Control Tips: మధుమేహం అనేది ప్రస్తుతం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం దాదాపు 422 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అంతేకాదు..మధుమేహం కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏడాదికి 15 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. 

మధుమేహం వ్యాధికి ఇప్పటి వరకూ నిర్దిష్టమైన చికిత్స లేదు. నియంత్రణ మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. వివిద రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా మధుమేహం సమస్య తలెత్తుతోంది. అందుకే జీవనశైలిని సక్రమంగా మార్చుకుని, సరైన హెల్తీ ఫుడ్స్ తినడం అలవాటు చేసుకుంటే కచ్చితంగా బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. దేశంలో ఇప్పుడు 8 కోట్లమంది మధుమేహంతో బాధపడుతుండగా..2045 నాటికి ఈ సంఖ్య 13 కోట్లకు చేరుకోవచ్చు. 

ప్రకృతిలో లభించే చాలా రకాల మొక్కలు, పదార్ధాలతో డయాబెటిస్‌ను చాలా సులభంగా నియంత్రించవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించవచ్చు. మధుమేహాన్ని ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచకపోతే రక్తపోటు, గుండె, మూత్ర పిండాలు, కంటి అవయవాలు ప్రబావితమౌతాయి. ప్రకృతిలో మన చుట్టూ లభించే కొన్ని రకాల ఆకులు, మొక్కలతో బ్లడ్ షుగర్ లెవెల్స్ అద్భుతంగా నియంత్రించవచ్చు. అన్నింటికంటే ఆశ్చర్యమేంటంటే డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు ఏ ఫ్రూట్‌కు పూర్తిగా దూరంగా ఉండాలో..ఆ చెట్టు ఆకులు మాత్రం డయాబెటిస్‌ను నియంత్రిస్తాయి.

వాస్తవానికి సీతాఫలం అనేది ప్రతి ఏటా వర్షాకాలం-చలికాలం మధ్యలో వచ్చే సీజనల్ ఫ్రూట్. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కానీ సీతాఫలాలను డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు అస్సలు తినకూడదు. మధుమేహంతో బాధపడేవాళ్లు సీతాఫలం పండ్లకు దూరంగా ఉండాలని వైద్యులు పదే పదే చెబుతుంటారు. అయితే ఆశ్చర్యమేంటంటే సీతాఫలం చెట్టు ఆకులు మాత్రం మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచిదట. ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయని, ఈ ఆకులు నమిలి తినడం వల్ల ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ స్థాయి గణనీయంగా పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 

ఇక అల్లోవెరా  ఆకులు. అల్లోవెరాలో ఉండే పోషక గుణాలు మరెందులోనూ ఉండవు. ఇది అద్బుతమైన ఔషధ మొక్క. అల్లోవెరాలో హైపోగ్లైసీమిక్ లక్షణాలు చాలా ఎక్కువ. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణలో ఉంటుంది. రోజూ ఉదయం పరగడుపున తింటే ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇక మరో అద్భుతమైన ఆకులు వేపాకులు. వేపాకులనగానే చాలా మందికి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలే గుర్తొస్తాయి. కానీ ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా చాలా ఉన్నాయని తేలింది. వేపాకుల్ని రోజూ నమిలి తినడం అలవాటు చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. ప్యాంక్రియాస్ పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా ఇన్సులిన్ సహజంగా ఉత్పత్తి అవుతుంది. 

Also read: Heart Failure Risk: గుండెపోటు ముప్పు ఈ వ్యక్తుల్లో ఎక్కువ, కారణమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News