Diabetes Diet: మధుమేహానికి చెక్ పెట్టాలనుకుంటున్నారా... అయితే ఈ ఆకుకూర ట్రై చేయండి

Fenugreek Benefits: మెంతికూర లేదా మెంతుల వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. డయాబెటిస్ ను అదుపు చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 11:37 AM IST
Diabetes Diet: మధుమేహానికి చెక్ పెట్టాలనుకుంటున్నారా... అయితే ఈ ఆకుకూర ట్రై చేయండి

Fenugreek For Diabetes Patients: మెంతికూర లేదా మెంతులు తినడానికి ఇష్టపడని వారు దేశంలో చాలా మందే ఉన్నారు. అయితే కొంతమంది మెంతి ఆకులను పిండిలో కలుపుకుని పరాఠాలు చేసి తింటారు. మెంతులను  ఏ రూపంలోనైనా తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఒక చెంచా మెంతి గింజలను నీటితో మింగడం వల్ల కడుపు లేదా వెన్నునొప్పి నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అయితే ఐరన్ పుష్కలంగా ఉండే మెంతులు మధుమేహాన్ని (Diabetes) అదుపు చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. 

మెంతికూరలోని ఔషధ గుణాలు
మెంతికూరలోని (Fenugreek Benefits) యాంటీ డయాబెటిక్ గుణాలు అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా మెంతి గింజల్లోని ఔషధ గుణాలపై అనేక పరిశోధనలు జరిగాయి. సౌదీ అరేబియాలోని సౌదీ యూనివర్శిటీలో నిర్వహించిన ఒక పరిశోధనలో మెంతి గింజల్లో యాంటీడయాబెటిక్, యాంటీకాన్సర్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫెర్టిలిటీ, యాంటీపరాసిటిక్ ల్యాక్టేషన్ స్టిమ్యులెంట్ మరియు హైపోకొలెస్టెరోలేమిక్ లక్షణాలు ఉన్నాయని తేలింది.

రోజువారీ ఆహారంలో మెంతులు చేర్చుకోండి
మెంతులు... ప్రోటీన్, ఫైబర్ గుణాలను కలిగి ఉంటుంది. అందుకే దీని బయోయాక్టివ్ సమ్మేళనాల కారణంగా ఔషధంగా ఉపయోగించవచ్చు. మెంతికూర వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి పరిశోధనలో చెప్పబడింది . రోజువారీ ఆహారంలో మెంతులు చేర్చుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్ చికిత్సలో మెంతులు ప్రయోజనకరంగా ఉంటాయి
డయాబెటిస్‌ రోగులకు (Diabetic Patients) మెంతులు వల్ల కలిగే ప్రయోజనాల ఏంటో పరిశోధనల్లో వెల్లడైంది.  ఒక వ్యక్తిలో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌తో సంబంధం ఉన్న జీవక్రియ లక్షణాలను తగ్గించడంలో మెంతుల వాడకం ప్రభావవంతంగా పనిచేసినట్లు కనుగొనబడింది. దీని వినియోగం రోగుల రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది. రోగి యొక్క గ్లూకోజ్ స్థాయి గణనీయంగా మెరుగుపడుతుంది.

చెడు కొలెస్ట్రాల్‌కు చెక్
ఇన్సులిన్ డిపెండెంట్ టైప్ 1 డయాబెటిస్ రోగులు తమ రోజువారీ ఆహారంలో 100 గ్రాముల మెంతి గింజల పొడిని జోడించడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

మెంతుల ఇతర ప్రయోజనాలు 
మెంతిలోని యాంటీవైరల్ లక్షణాలు గొంతు నొప్పికి శక్తివంతమైన హెర్బల్ రెమెడీగా చేస్తాయి. జుట్టు రాలడం, మలబద్ధకం, పేగు పనిచేయకపోవడం, మూత్రపిండాల వ్యాధి, గుండెల్లో మంట, మగ వంధ్యత్వం మరియు ఇతర రకాల లైంగిక బలహీనతలకు చికిత్స చేయడంలో కూడా మెంతులు ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది.

Also Read: Raw Banana Benefits: పచ్చి అరటిపండును తినండి... ఈ వ్యాధులను దూరం చేయండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News