Fruits For Diabetes: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది మధుమేహం బారినపడుతున్నారు. అంతేకాకుండా ఈ సమస్య రావడానికి ఆహారపు అలవాట్లు కూడా ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో డయాబెటిస్ ఉన్నవారిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో లైఫ్ స్టయిల్‌తో పాటు డైట్‌లో పలు రకాల మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. చలి కాలంలో చాలా మందిలో ఎన్ని రకాల ఔషధాలు వినియోగించిన షుగర్ లెవల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయాల్లో ఖాళీ కడుపుతో ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని పండ్లను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది.
బొప్పాయి పండ్లు:
డయాబెటిస్ బాధపడేవారికి బొప్పాయి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చలి కాలంలో మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో బొప్పాయిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
జామ పండ్లు:
మధుమేహం ఉన్నవారు చలి కాలంలో జామ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లలో ఫైబర్ పరిమాణాలు అధికంగా లభిస్తాయి. దీని కారణంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. దీంతో పాటు శరీర బరువు కూడా అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
యాపిల్:
డయాబెటిస్‌తో బాధపడేవారికి యాపిల్ పండ్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పొట్ట సంబంధిత సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. చలి కాలంలో రక్తంలోని చక్కెర పరిమాణాలు తరచుగా పెరిగితే తప్పకుండా ఖాళీ కడుపుతో యాపిల్ పండ్లను తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
బత్తాయి పండ్లు:
చలి కాలంలో మధుమేహం ఉన్నవారు బత్తాయి పండ్లు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తాయి.
పియర్:
పియర్ ఫ్రూట్స్ తక్కువ GIని కలిగి ఉంటాయి. ఇందులో అధిక మోతాదులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఈ ఫ్రూట్స్‌ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook