Benefits Of Eating Dried Black Dates: చలి కాలం ప్రతి ఒక్కరూ ఎండు ఖర్జూరాని తింటూ ఉంటారు. అయితే వీటిని శీతాకాలంలో తినడం మంచిదేనా అనే సందేహం కలుగొచ్చు. ఈ సీజన్లో ఖర్జూర పండ్లను తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్లో వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి చలి కాలంలో వీటిని తినడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ ఎండు ఖర్జూర స్త్రీల కంటే పురుషులకు చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.
ఇందులో క్యాల్షియం, ఫైబర్, జింక్, ఐరన్, విటమిన్ సి మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని పురుషులు తినడం వల్ల శారీరక బలహీనతను తొలగించడంతో పాటు, శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఎండు ఖర్జూరాలను చలికాలంలో తింటే ఈ ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
వీక్ నెస్‌కు చెక్:
పురుషులు చలికాలంలో బ్లాక్ డేట్స్ ను రెగ్యులర్‌గా తింటే శరీరం దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ప్రతి రోజూ వీటిని తినడం ఆరోగ్యనికి చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
లైంగిక సమస్యలు తగ్గుతాయి:
ఖర్జూరాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పురుషులల్లో లైంగిక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా స్టామినా కూడా సులభంగా పెరుగుతుంది. కాబట్టి శరీర బలహీనత సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది:
నల్ల ఖర్జూరంలో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల పొట్ట హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. కాబట్టి మలబద్ధకం ఇతర పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
కండరాలను బలోపేతం చేస్తుంది:
శరీరానికి పర్ఫెక్ట్ షేప్ తెచ్చుకోవాలనుకునే వారు తప్పకుండా ఈ డేట్స్‌ను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రొటీన్ల పరిమాణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి శరీరాన్ని దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. కాబట్టి వ్యాయామాలు చేస్తున్నవారు ప్రతి రోజూ వీటిని తినాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్
Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook