Hyperpigmentation Face Scrub: ముఖంపై నల్ల మచ్చలను తొలగించడంలో ఈ  ఇంట్టి చిట్కాలు..!

Hyperpigmentation  Face Scrub Homemade: నేటి కాలంలో చాలా మంది యువతి, యువతులు ముఖంపై వచ్చే నల్ల మచ్చలను తొలగించుకోవడానికి ఎన్నో రకాల ప్రొడెక్ట్స్‌ ఉపయోగిస్తున్నారు.  దీని కోసం మీరు ఎలాంటి ప్రొడెక్ట్స్‌ను ఉపయోగించకుండా ఇంట్లోనే కొన్ని రెమిడీలను ఉపయోగించి మచ్చలను తొలగించుకోవచ్చని చర్మ నిపుణులు చెబుతున్నారు  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2024, 11:06 AM IST
Hyperpigmentation Face Scrub: ముఖంపై నల్ల మచ్చలను తొలగించడంలో ఈ  ఇంట్టి చిట్కాలు..!

Hyperpigmentation Face Scrub Homemade: నల్ల మచ్చలను హైపర్‌పిగ్మెంటేషన్ అని వైద్య పరంగా పిలుస్తారు. ఈ హైపర్‌పిగ్మెంటేషన్ అనేది చర్మంపై ముదురు మచ్చలు ఏర్పడటానికి కారణమయ్యే సాధారణ పరిస్థితి. ఇది మెలనిన్ అనే చర్మం రంగు పదార్థం అతిగా ఉత్పత్తి కావడం వల్ల సంభవిస్తుంది. హైపర్‌పిగ్మెంటేషన్‌కు అనేక కారణాలు ఉన్నాయి, వీటిలో సూర్యరశమి, గాయాలు, హార్మోన్ల మార్పులు మరియు ఔషధాల వాడకం వల్ల కలుగుతాయి. 

హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గించడానికి లేదా తొలగించడానికి అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలు కూడా ప్రభావవంతంగా ఉంటాయి.  ఇంట్లో తయారు చేసిన స్క్రబ్‌లు చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి అలాగే చర్మం యొక్క మొత్తం టోన్‌ను మెరుగుపరచడానికి సహాయపడతాయి.

హైపర్‌పిగ్మెంటేషన్ కోసం కొన్ని ఇంట్లో తయారు చేసిన స్క్రబ్‌లు ఉన్నాయి:

1. పసుపు-పాలు స్క్రబ్:

పసుపు యాంటీసెప్టిక్ ,  యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి మచ్చలను, చర్మం యొక్క మొత్తం టోన్‌ను మెరుగుపరచడానికి సహాయపడతాయి.పాలు లాక్టిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది.

కావాల్సిసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ పసుపు
2 టేబుల్ స్పూన్లు పాలు

తయారీ విధానం:

పసుపు, పాలను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి సున్నితమైన మసాజ్ చేయండి.15 నిమిషాలు తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

2. ఓట్మీల్ మరియు తేనె స్క్రబ్:

ఓట్మీల్ సహజ ఎక్స్ఫోలియంట్. ఇది చర్మ కణాలను తొలగించడానికి  ఎంతో సహాయపడుతుంది. అలాగే  రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. తేనె సహజ మాయిశ్చరైజర్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి చర్మాన్ని తేమగా ఉంచడానికి  ఇన్ఫెక్షన్లను నిరోధించడానికి సహాయపడతాయి.

కావాల్సిసిన పదార్థాలు:

2 టేబుల్ స్పూన్లు ఓట్మీల్
1 టేబుల్ స్పూన్ తేనె

Also Read:  Diabetes Diet: కేవలం 28 గ్రాముల డ్రై ఫ్రూట్స్‌తో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇలా తగ్గించుకోవచ్చు

తయారీ విధానం:

ఓట్మీల్‌ను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇందులో తేనెతో కలపండి.ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి సున్నితమైన మసాజ్ చేయండి.
15 నిమిషాలు తర్వాత దీని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల మీ చర్మం మీద ఉన్న నల్ల మచ్చలను తొలగించుకోవచ్చు. దీని కోసం మీరు ఎలాంటి  ప్రొడెక్ట్స్‌ను ఉపయోగించే అవసరం లేదు. నల్ల మచ్చలను తొలగించడానికి ఇది ఎంతో మేలు చేస్తాయి. 

Also Read: Weight Loss In 10 Days: ఎండా కాలంలో పింపుల్‌గా 10 రోజుల్లో బరువు తగ్గాలనుకునేవారికి నిపుణుల సూచనలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News