Eye Care Tips: కంటి వెలుగును పెంచే 5 అద్భుతమైన హోమ్ రెమిడీస్ ఇవే

Eye Care Tips: సర్వేంద్రియానం..నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కంటి సంరక్షణ అత్యంత అవసరం. కంటి చూపు మందగించేందుకు చెడు జీవనశైలి ప్రధాన కారణం. కంటిచూపును మెరుగుపర్చేందుకు సులభమైన 5 హోమ్ రెమిడీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 29, 2022, 08:32 PM IST
Eye Care Tips: కంటి వెలుగును పెంచే 5 అద్భుతమైన హోమ్ రెమిడీస్ ఇవే

Eye Care Tips: సర్వేంద్రియానం..నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కంటి సంరక్షణ అత్యంత అవసరం. కంటి చూపు మందగించేందుకు చెడు జీవనశైలి ప్రధాన కారణం. కంటిచూపును మెరుగుపర్చేందుకు సులభమైన 5 హోమ్ రెమిడీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

మానవ శరీరంలో అతి సున్నితమైన అంగం కళ్లు. కంటి సంరక్షణ చాలా ముఖ్యం. కంటి వెలుగు మందగించడం అనేది ఇటీవలి కాలంలో సర్వ సాధారణంగా మారింది. కంటి చూపు మందగించేందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి జెనెటిక్ అయితే రెండవది చెడు జీవనశైలి. టీవీ దగ్గర్నించి చూడటం, చదివేటప్పుడు సరైన వెలుతురు లేకపోవడం, తినే భోజనంలో పోషక పదార్ధాలు లోపించడం వంటివి ఇతర కారణాలు. అందుకే పోషక పదార్ధాలుండే భోజనం చాలా కీలకం. కంటి చూపును మెరుగుపర్చేందుకు 5 సులభమైన హోమ్ రెమిడీస్ మీ కోసం అందిస్తున్నాం..

కళ్లను తరచూ అంటే రోజుకు కనీసం 2-3 సార్లు చల్లటి నీళ్లతో కడుగుతూ ఉండాలి. ఎక్కువ సమయం కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌పై గడిపేవారికి ఇది చాలా అవసరం.

కంటికి విటమిన్ ఎ అనేది చాలా అవసరం. అందుకే క్యారెట్, బొప్పాయి, ఉసిరి, షిమ్లా మిర్చి, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు డైట్‌లో భాగంగా ఉండాలి. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. 

ఉసరి, త్రిఫలం అనేది కంటికి చాలా మంచిది. రోజూ ఒక కప్పు నీళ్లలో ఒక స్పూన్ ఉసిరి రసం లేదా ఉసిరి పౌడర్ కలిపి తీసుకోవాలి. ఉదయం తేనెతో ఉసిరి రసం కలిపి కూడా తాగవచ్చు. కంటి వెలుగు పెంచేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. 

కంటి ఆరోగ్యం కోసం ఫైబర్, విటమిన్లు చాలా కీలకంగా ఉపయోగపడతాయి. దీనికోసం బాదం, కిస్‌మిస్, అంజీరాలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి..ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

అరచేతులతో కళ్లను కాపరం చేయడం చాలా మంది పద్ధతి. ఉదయం లేవగానే రెండు అరచేతుల్ని రుద్ది..కళ్లపై ఉంచాలి. అలా మళ్లీ మళ్లీ చేయాలి. కనీసం రోజుకు 4-5 సార్లు చేయాలి. 

Also read: Vitamin B6 Rich Foods: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే వీటిని ఆహారంగా తీసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News