Cholesterol And High BP: అధిక రక్త పోటు, చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలకు ఈ గింజలతో 12 రోజుల్లో చెక్‌ పెట్టండి!

Flaxseeds For Cholesterol And High BP: అవిసె గింజల ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా రక్తంలో కొలెస్ట్రాల్‌ను కరిగించేందు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే గుండె పోటు సమస్యలతో బాధపడేవారు వీటిని ప్రతి రోజూ తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి శరీరం సురక్షితంగా ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2023, 03:24 PM IST
Cholesterol And High BP: అధిక రక్త పోటు, చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలకు ఈ గింజలతో 12 రోజుల్లో చెక్‌ పెట్టండి!

Flaxseeds For Cholesterol And High BP: కొలెస్ట్రాల్‌ పెరగడం, అధిక రక్తపోటు సమస్యలతో చాలా మంది సతమతమవుతున్నారు. చాలా మంది ఈ రెండింటినీ నియంత్రించుకోలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే చాలా మందిలో ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అధికంగా కొలెస్ట్రాల్‌ ఉన్న ఆహారాలు తీసుకుని శరీర శ్రమ చేయకపోవడం వల్లేనని ఆరగ్యోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల చాలా మందిలో నడుము చుట్టూ కొవ్వు పెరగడం, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం, సిరల్లో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతన్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

ఈ గింజతో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా?:
ప్రముఖ్య ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించడానికి అవిసె గింజలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే గుణాలు  ధమనులలో ఫలకాన్ని తగ్గించి  రక్తపోటు సమస్యలను నివారిస్తుంది.

అవిసె గింజలలో లభించే పోషకాలు ఇవే:
అవిసె గింజలలో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, ప్రొటీన్, ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఫైబర్, కాపర్, సెలీనియం, కెరోటిన్ అధిక పరిమాణంలో లభిస్తాయి.  అంతేకాకుండా  రక్తపోటు ఫంగల్, యాంటీ-వైరల్ లక్షణాలు కూడా లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
 
అవిసె గింజలతో కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలో తెలుసా?:
అవిసె గింజలను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ని నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధితో బాధపడేవారికి ప్రభావవంతంగా సహాయపడుతుంది.

అవిసె గింజలతో కరిగే ఫైబర్, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్‌ను సులభంగా కరిగిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను కూడా తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. అయితే తరచుగా అనారోగ్య సమస్యల బాధపడుతున్నవారు వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Ind Vs SL: సిరీస్‌ విజయంపై భారత్ కన్ను.. ఆ ప్లేయర్‌ను ఆపితేనే..! 

Also Read: India vs Sri Lanka: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు.. నెట్టింట వీడియో వైరల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News