Ghee For Heart Patients: గుండె జబ్బులు ఉన్నవారికి ఆహారం ఒక ముఖ్యమైన అంశం. సరైన ఆహారం ఎంపికలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అయితే, కొన్ని ఆహారాల గురించి, ముఖ్యంగా నెయ్యి వెన్న వంటి కొవ్వు పదార్థాల గురించి చాలా గందరగోళం ఉంది. ఎందుకంటే ఈ రెండింటిలోనూ సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అయితే గుండె సమస్యలు ఉన్నవారు నెయ్యి, వెన్న తినవచ్చా అనే సందేహం ఉంటుంది. ఆరోగ్యానిపుణులు ప్రకారం గుండె జబ్బులున్నవారు నెయ్యి, వెన్న తినడం మంచిది కాదు.
నెయ్యి, వెన్న ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల చెడు (LDL) కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కానీ నెయ్యిలో ఆరోగ్యకరమైన లక్షణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ,డి, కె లు అధికంగా ఉంటాయి. అలాగే కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి.
ఆరోగ్యనిపుణులు ప్రకారం గుండె జబ్బులు ఉన్నవారు నెయ్యిని మితంగా తీసుకోవడం చాలా అవసరం. ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ ఎంటే ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. ఆవులు పాలతో తయారు చేసే నెయ్యిని తినవచ్చు.
గుండె సమస్యలు ఉన్నవారు వెన్న కంటే నెయ్యిని తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వెన్నలో కొవ్వు మాత్రమే కాకుండా ట్రాన్స్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. వెన్న కంటే నెయ్యి మంచి ఎంపిక అని గుర్తుంచుకోండి. వెన్నలో సంతృప్త కొవ్వులు మాత్రమే కాకుండా, ట్రాన్స్ కొవ్వులు కూడా ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి మరింత హానికరం.
గుండె సమస్యలు ఉన్నవారు ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా ఆలివ్ నూనె, కనోలా నూనె, అవకాడో, నట్స్, చేపలు, గుడ్లు తీసుకోవాల్సి ఉంటుంది. గుండె సమస్యలు ఉన్నవారు ధూమపానం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ , రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించండి.
ఈ విధంగా గుండె సమస్యలు ఉన్నవారు ఈ రెండిటికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఒకవేళ నెయ్యి, వెన్నా తీసుకోవాల్సి ఉంటే మితంగా తీసుకోవడం చాలా మంచిది. అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి