How To Make Apple Cider Vinegar Hair Water For Hair Growth: యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, అమినో యాసిడ్స్ వంటి అనేక మూలికలు ఉంటాయి. ఇవి చర్మానికి, జుట్టుకు చాలా రకాలుగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టులోని మురికిని తొలగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చుండ్రు వంటి సమస్య నుంచి ఉపశమనం కలిగించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం, ఆయిల్ స్కాల్ప్ వంటి సమస్యలు కూడా తొలగిస్తుంది. అయితే జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి ఇప్పుడు మీ ముందుకు ఆపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ వాటర్‌ని తీసుకొచ్చాము. దీనిని ప్రతి రోజూ వినియోగించడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు దూరమవుతాయి. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ వాటర్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ వాటర్ చేయడానికి కావలసిన పదార్థాలు:
1/3 కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్
కప్పు వెచ్చని నీరు
ఆపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ వాటర్ తయారీ విధానం:
ఆపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ వాటర్ చేయడానికి ముందుగా ఒక పాన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత అందులో 1/4వ వంతు నీటిని పోసి గోరువెచ్చగా చేసుకోవాలి.
ఇప్పుడు అందులో 1/3 కప్పు సేంద్రీయ ఆపిల్ సైడర్ వెనిగర్ పోసి కొద్ది సేపు అలానే ఉంచాల్సి ఉంటుంది.
ఈ రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టాల్సి ఉంటుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ వాటర్‌ని ఇలా వినియోగించాలి:
ఆపిల్ సైడర్ వెనిగర్‌ని జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది.
అలాగే జుట్టుకు 1-3 నిమిషాల పాటు ఉంచాలి.
ఆ తర్వాత జుట్టును చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ నీటిని వారానికి రెండు సార్లు జుట్టుకు రాసుకుంటే చిట్లడం తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు కూడా సులభంగా పెరుగుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?
Also Read: Upasana Baby Bump Pics : రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook