Curry Leaves juice: కరివేపాకు నీళ్లతో బోలెడన్ని లాభాలు.. బరువుకి సైతం చెక్!

Curry Leaves for Weight Loss: కరివేపాకుని మనం చాలా ఆహార పదార్థాలలో వాడుతూ ఉంటాం. కరివేపాకు లేకుండా తాలింపు ఉండదు… తాలింపు లేకుండా మన కూరలు ఉండవు…అయితే తినేటప్పుడు మాత్రం కరివేపాకే కదా అని వాటిని పడేస్తూ ఉంటాం. కానీ కరివేపాకులో బోలెడు లాభాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా?

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 28, 2024, 03:50 PM IST
Curry Leaves juice: కరివేపాకు నీళ్లతో బోలెడన్ని లాభాలు.. బరువుకి సైతం చెక్!

Curry Leaves Benefits : ప్రతి కూరలో మనం కరివేపాకు వేస్తూనే ఉంటాం. రుచితో పాటు మంచి వాసనను కూడా అందిస్తుంది ఈ కరివేపాకు. అయితే కొంతమంది మాత్రం తినేటప్పుడు మాత్రం కరివేపాకుని పడేస్తూ ఉంటాం. కానీ కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజు కరివేపాకు నీళ్లు తాగడం వల్ల మన శరీరానికి బోలెడంత మేలు జరుగుతుంది. కరివేపాకుని ఒక దివ్య ఔషధంగా కూడా వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. దీనిని ఎన్నో రకాలుగా వాడొచ్చు. మరి దీని వల్ల ప్రయోజనాలు ఏమిటో చూద్దాం..

బరువు తగ్గాలి అనుకునే వారికి కరివేపాకు నీళ్లు అమృతం లాగా పనిచేస్తాయి. రోజు కరివేపాకు నీళ్లు తాగితే ఊబకాయం మీ దగ్గరకు కూడా రాదు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కూడా కరివేపాకు చాలా వేగంగా కరిగిస్తుంది. 

కరివేపాకు వల్ల జీర్ణక్రియ కూడా వేగంగా జరుగుతుంది. అందులో ఉండే పోషకాలు పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా గ్యాస్, మల బద్ధకం, విరోచనాలు వంటి సమస్యలు ఉన్నప్పుడు, కరివేపాకు నీళ్లు తాగితే చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది. 
కరివేపాకు నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉన్న విషపూరితమైన అంశాలను చిటికెలో తొలగిస్తాయి. మన శరీరంలోని వ్యర్ధాలను పూర్తిగా బయటకు పంపిస్తాయి.  

కరివేపాకు నీళ్ల వల్ల చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా మారుతుంది. చర్మ సమస్యలు దూరం అయ్యి ఇన్ఫెక్షన్లు కూడా మన దగ్గరికి రావు. కరివేపాకు నీళ్లు తాగడం వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. రోజూ కరివేపాకు నీళ్లు తాగడం వల్ల మన జుట్టు ఊడడం తగ్గిపోయి, ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది.

కరివేపాకు నీళ్లు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి. ప్రతిరోజు ఉదయం ఈ నీళ్లు తాగడం వల్ల హైపర్ టెన్షన్ మన దరిదాపుల్లోకి రాదు. దీంతో గుండె జబ్బులను కూడా నియంత్రించవచ్చు. 

కరివేపాకు జ్యూస్ తయారీ విధానం:

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కరివేపాకు నీళ్లు తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక రెండు రెమ్మల కరివేపాకుని రెండు గ్లాసుల నీళ్లలో వేసి ఉడికించుకోవాలి. బాగా మరిగాక స్టవ్ ఆపేసి వడగట్టుకోవాలి. ఆ నీళ్లలో కొంచెం నిమ్మరసం పిండుకొని తాగాలి. నచ్చితే అందులో కొంచెం తేనె కూడా కలుపుకొని తాగితే ఇంకా రుచిగా ఉంటుంది. 

ఇలా మనం తీసిపారేసే కరివేపాకు వల్ల మనకి తెలియకుండానే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇకపై కరివేపాకుని కూరలో మాత్రమే కాకుండా, నీళ్లలో మరిగించి తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు పొందవచ్చు.

Also Read: YSRCP Manifesto: మేనిఫెస్టోను 99 శాతం అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా: వైఎస్‌ జగన్‌

Also Read: Pithapuram: పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌.. పిఠాపురంలో గెలుపు కష్టమా? చెప్పులు కుట్టే వ్యక్తి కూడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News