Health Benefits of Millet: మిల్లెట్‌ను భారతీయులు 7000 సంవత్సరాలకు పైగా ఆహారంగా తీసుకుంటున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరాన్ని మినుముల సంవత్సరంగా ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా మిల్లెట్ వినియోగం తెగ పెరిగిపోయింది. ఇందులో తక్కువ కార్బన్ ఫుట్ ప్రింట్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు కూడా లభిస్తాయి. వీటిని ప్రతి రోజు ఉదయం ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. ప్రతి రోజు వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ మిల్లెట్‌తో చేసిన ఆహారాలు తీసుకుంటే లాభాలే లాభాలు:
జొన్న (Sorghum):
ప్రతి రోజు ఆహారంలో జొన్నలో తయారు చేసిన ఆహారాలు తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీర బరువును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జొన్న తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రతి రోజు భోజనంలో జొన్న కలిగిన ఆహారాలు తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పాలీఫెనాల్స్, టానిన్‌లు యాంటీ మ్యూటాజెనిక్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు మధుమేహం సమస్యలు రాకుండా ఉపశమనం కలిగిస్తాయి.
Also Read: ENG Vs IRE: బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా.. బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు
రాగులు(Finger millet):
శరీరాన్ని దృఢంగా ఉంచేందుకు అనారోగ్య సమస్యల నుంచి బాడీని రక్షించేందుకు రాగులు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు మధుమేహం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో యాంటీఆక్సిడెంట్ల పరిమాణాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించేందుకు సహాయపడుతుంది. కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రాగులను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఐరన్ లోపం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
మిల్లెట్స్(millet):
మిల్లెట్స్‌లో ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ప్రతి రోజు ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అధిక పరిమాణంలో మెగ్నీషియం లభిస్తుంది. దీంతో తీవ్ర ప్రాణంతక వ్యాధుల దూరమవుతాయి. బరువు తగ్గాలనుకువారు ప్రతి రోజు డైట్‌లో వీటిని ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: ENG Vs IRE: బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా.. బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి