Okra Water Benfits: మనం బెండకాయను కూర రూపంలో వండుకుంటాం. లేదా పులుసు పెట్టుకుంటాం. లేదా బెండకాయ ఫ్రై చేసుకుంటాం. దీంతో తయారు చేసిన కూరగాయలు ఎంతో రుచిగా కూడా ఉంటాయి. అయితే, ఈ బెండకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటే మీరు నమ్ముతారా? ఇది డయాబెటిస్, గుండె జబ్బులు, కిడ్నీ, రక్తపోటు సమస్యలకు చెక్ పెడుతుంది. బెండకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అంతేకాదు, బెండకాయలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. బెండకాయ ముఖ్యంగా ఆస్తమా రోగులకు బెండకాయ ఎంతో మేలు చేస్తుంది. బెండకాయ పిల్లలకు కూడా ఎంతో మంచిది. అయితే, గర్భిణులు కూడా బెండకాయను తినవచ్చు ఇది బాడీ పెయిన్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అయితే, బెండకాయ నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బెండకాయను కట్ చేసి రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని పరగడుపున బ్రష్ చేయగానే తీసుకోవాలి. బెండకాయ నీరు నేరుగా తాగకపోతే కాసింత మిరియాలు, ఉప్పు వేసుకుని తీసుకోవాలి. అయితే, బెండకాయ నీరు ఏ వ్యాధికి ఉపశమనం కల్పిస్తుందో తెలుసుకుందాం.
ఇదీ చదవండి: ఎండకాలం తరచూ మజ్జిగ తాగుతున్నారా? ఈ సైడ్‌ఎఫెక్ట్స్ తప్పవు జాగ్రత్త..
మలబద్ధకం ..
బెండకాయ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. ఇందులో ఉండే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఒకవేళ డయాబెటిస్‌తో బాధపడితే ఈ బెండకాయ నీటిని తాగాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
బెండకాయలో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటుంది. ఈ నీటిని ప్రతిరోజూ రెండుసార్లు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా బెండకాయ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురికారు. ఇందులో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. బెండకాయ నీరు బ్లడ్ ప్రెజర్‌ను అదుపులో ఉంచుతుంది. అంతేకాదు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ను కరిగించే గుణం బెండకాయకు ఉంటుంది. బెండకాయ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఇదీ చదవండి: రోజూకు ఎంత మోతాదులో ఐరన్ అవసరం, ఐరన్ లోపంతో కన్పించే లక్షణాలేంటి
బెండకాయ మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫాలెఫెనల్, ఫ్లవనాయిడ్స్ రక్తంలో ఇన్సూలిన్ స్థాయిలను పెంచుతాయి. కానీ, బెండకాయలో ఉండే ఫ్రక్టాన్ జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook