Protein poisoning: ప్రోటీన్ పాయిజనింగ్ అంటే ఏంటి, ప్రోటీన్లు ఎక్కువైతే ఏమౌతుంది

Protein poisoning: మెరుగైన ఆరోగ్యం కోసం ప్రోటీన్ ఫుడ్ చాలా అవసరం. ప్రతి వైద్యుడూ చెప్పేది ఇదే. అదే సమయంలో ప్రోటీన్ ఫుడ్ పరిమితి దాటి తింటే అనర్ధాలు ఎదురౌతాయా..ఏం జరుగుతుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 8, 2022, 10:48 PM IST
Protein poisoning: ప్రోటీన్ పాయిజనింగ్ అంటే ఏంటి, ప్రోటీన్లు ఎక్కువైతే ఏమౌతుంది

Protein poisoning: మెరుగైన ఆరోగ్యం కోసం ప్రోటీన్ ఫుడ్ చాలా అవసరం. ప్రతి వైద్యుడూ చెప్పేది ఇదే. అదే సమయంలో ప్రోటీన్ ఫుడ్ పరిమితి దాటి తింటే అనర్ధాలు ఎదురౌతాయా..ఏం జరుగుతుంది.

ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆకర్షణీయంగా, ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలో వివిధ రకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. జిమ్స్, యోగా, రన్నింగ్, వాకింగ్ చేస్తుంటారు. దాంతోపాటు ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటుంటారు. బరువు తగ్గే క్రమంలో ప్రోటీన్ ఫుడ్స్ పరిమితి దాటి కూడా తీసుకుంటారు కొంతమంది. ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. మరోవైపు ఇందులోని న్యూట్రియంట్లు శరీర కణాల మరమ్మత్తుకు ఉపయోగపడతాయి. దాంతోపాటు చర్మం, కేశాల సంరక్షణలో దోహదపడతాయి. శరీరానికి ప్రోటీన్లు చాలా మంచివి. కానీ పరిమితి దాటితే మాత్రం ఆరోగ్యానికి హాని కల్గిస్తాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. పరిమితి దాటి తీసుకుంటే ఆరోగ్యానికి సమస్యేనట. దీనికే ప్రోటీన్ పాయిజనింగ్ అంటారు. 

డైట్‌లో ప్రోటీన్లు పరిమాణం ఎంత ఉండాలి

వైద్య నిపుణుల ప్రకారం మన బరువులో ప్రతి ఒక్క కిలోగ్రాముకు 1 గ్రాము ప్రోటీన్ అవసరమౌతుంది. అంటే మన బరువు 60 కిలోలుంటే..60 గ్రాముల ప్రోటీన్ సరిపోతుంది. దీనితో పాటు కార్బొహైడ్రేట్లు, ఫ్యాట్ కూడా తగిన మోతాదులో ఉండాల్సిందే. అవసరానికి మించి ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల ప్రోటీన్ పాయజనింగ్‌కు దారితీస్తుంది. 

ప్రోటీన్ సైడ్‌ఎఫెక్ట్స్

సాధారంగా బరువు తగ్గించేందుకు ప్రోటీన్ ఫుడ్స్ వాడుతుంటారు. కానీ పరిమితికి మించి ప్రోటీన్లు తీసుకుంటే..బరువు తగ్గడానికి బదులు పెరుగుతుందంటున్నారు డైటిషియన్లు. దీనివల్ల శరీరం షేప్ మారిపోవచ్చు. అందుకే మితంగానే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి.

రోజువారీ డైట్‌లో అవసరానికి మించి ప్రోటీన్లు తీసుకుంటే..డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రోటీన్లు జీర్ణం కావాలంటే శరీరంలో ఎక్కువ మోతాదులో నీరు అవసరమౌతుంది. ఇదంతా యూరిన్ రూపంలో శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. నీరు ఎక్కువగా పోవడంతో డీహైడ్రేషన్ సమస్య ఏర్పడవచ్చు.

ఎక్కువ ప్రోటీన్లు ఉన్న ఆహారం, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తినడం వల్ల ఆందోళన, ఒత్తిడి, బెంగ వంటి నెగెటివ్ భావాలు, సమస్యలు తలెత్తవచ్చు. ప్రోటీన్లు ఎక్కువైతే శరీరంలో స్ట్రెస్ హార్మోన్ పెరిగి..డిప్రెషన్‌కు కారణమౌతుంది. 

Also read: Multibagger Stock: ఒకప్పుడు 15 రూపాయల షేర్..ఇప్పుడు 3 వేల రూపాయలు, ఊహించని లాభాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News