Orange precautions: మీకు ఆ సమస్యలుంటే..ఆరెంజ్ తినకూడదు, తస్మాత్ జాగ్రత్త

Orange precautions: పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. మెరుగైన ఆరోగ్యం కోసం ఫ్రూట్స్ తీసుకోవడం అత్యుత్తమం. అయితే అందరూ అన్ని పండ్లు తినకూడదంటున్నారు వైద్య నిపుణులు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 2, 2022, 01:01 AM IST
Orange precautions: మీకు ఆ సమస్యలుంటే..ఆరెంజ్ తినకూడదు, తస్మాత్ జాగ్రత్త

ఎప్పుడు ఏది తిన్నా తినకపోయినా సిజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్‌తో ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఇందులో ముఖ్యమైంది పోషక పదార్ధాలతో నిండి ఉండే ఆరెంజ్. మరి అందరూ ఆరెంజ్ తినవచ్చా..

బెస్ట్ సీజనల్ ఫ్రూట్‌గా ఆరెంజ్‌ను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో పోషక పదార్ధాలు చాలా ఎక్కువ. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి న్యూట్రియంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇంతటి అద్భుతమైన పోషక పదార్ధాలున్న ఆరెంజ్ ఆరోగ్యానికి మంచిదే అయినా..కొంతమంది మాత్రం కొన్ని పరిస్థితుల్లో తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరెంజ్ ఎవరెవరు ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎవరు తినకూడదు, కారణమేంటి

కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడేవారు ఆరెంజ్ తినడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. గ్యాస్ట్రైటిస్, ఎసిడిటీ సమస్య ఉన్నవాళ్లు కూడా ఆరెంజ్ జ్యూస్ తీసుకోకూడదు. దీనివల్ల కడుపులో, ఛాతీలో మంట పెరుగుతుంది. పళ్లలో కేవిటీ సమస్యతో బాధపడేవారు కూడా ఆరెంజ్‌కు దూరంగా ఉండాలి. ఇందులో ఉండే ఓ విధమైన యాసిడ్..పళ్లలో ఉండే ఎనామిల్ సహిత కాల్షియంతో మిక్స్ అయితే..బ్యాక్టీరియల్ ఇన్‌పెక్షన్ వస్తుంది. దంత కేవిటీ సమస్యతో బాధపడేవాళ్లు..ఆరెంజ్ తింటే ఆ సమస్య మరింతగా పెరుగుతుంది. 

ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందిపడేవాళ్లు బత్తాయి పండ్లు తినకూడదు. ఎందుకంటే కడుపు పట్టేయడం, అజీర్ణం వంటి సమస్యలు ఎదురౌతాయి.  ఇందులో ఉండే ఫైబర్ కారణంగా ఎక్కువగా తీసుకుంటే విరేచనాలు కూడా రావచ్చు. కొంతమందికి కడుపు నొప్పి వస్తుంటుంది. ఇందులో ఉండే యాసిడ్ కడుపు నొప్పిని మరింతగా పెంచుతుంది. 

అందుకే సాధ్యమైనంతవరకూ ఈ సమస్యలతో బాధపడేవారు ఆరెంజ్‌కు దూరం పాటించడమే మంచిది. లేకపోతే అనారోగ్యం కొనితెచ్చుకోవల్సి వస్తుంది. 

Also read: Coves Benefits: రోజుకు ఒక్క లవంగం చాలు..ఆ సమస్యలన్నీ దూరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

oves Benefits: రోజుకు ఒక్క లవంగం చాలు..ఆ సమస్యలన్నీ దూరం

Trending News