Weakness Tips: శారీరక బలహీనత సమస్యగా మారిందా..ఈ ఫుడ్స్ తీసుకుంటే ఆ సమస్యను అధిగమించడం సులభం

Weakness Tips: శారీరక బలహీనత చాలా ప్రమాదకరం. అతి పెద్ద సమస్య ఇది. బలహీనత కారణంగా ఏ పనీ సక్రమంగా చేయలేం. ముఖ్యంగా పురుషులకు ఆ పనిలో ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే మీ డైట్‌‌లో కొన్ని పదార్ధాలు చేర్చుకుంటే ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చు..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 1, 2022, 11:12 PM IST
Weakness Tips: శారీరక బలహీనత సమస్యగా మారిందా..ఈ ఫుడ్స్ తీసుకుంటే ఆ సమస్యను అధిగమించడం సులభం

Weakness Tips: శారీరక బలహీనత చాలా ప్రమాదకరం. అతి పెద్ద సమస్య ఇది. బలహీనత కారణంగా ఏ పనీ సక్రమంగా చేయలేం. ముఖ్యంగా పురుషులకు ఆ పనిలో ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే మీ డైట్‌‌లో కొన్ని పదార్ధాలు చేర్చుకుంటే ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చు..

రోజువారీ బిజీ లైఫ్‌స్టైల్, పోటీ ప్రపంచం కారణంగా ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటాయి. సరైన ఆహారం తినకపోవడంతో శారీరక బలహీనత ఎదురౌతుంది. ఎప్పుడైతే శారీరక బలహీనత ఉంటుందో..ఏ పని కూడా సవ్యంగా జరగదు. ముఖ్యంగా మగవారికి లైంగిక విషయాల్లో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు మీ డైట్ మార్చుకోవాలి. కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని చేర్చుకోవాలి. అలా చేస్తే శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. శారీరక బలహీనతను దూరం చేసేందుకు డైట్‌లో ఏయే ఆహార పదార్ధాలు చేర్చుకోవాలో తెలుసుకుందాం..

శారీరక బలహీనతకు కారణాలు

విటమిన్ బి 12 లోపం కారణంగా శారీరక బలహీనత తలెత్తుతుంది. డిప్రెషన్, ఆందోళన కూడా శారీరక బలహీనతకు కారణాలు. ఏదైనా వ్యాధి కారణంగా కూడా శారీరక బలహీనత ఎదురుకావచ్చు. శారీరక బలహీనతను దూరం చేసేందుకు సీజనల్ పండ్లు, కూరగాయలు తప్పకుండా డైట్‌లో చేర్చాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా అవసరం. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్ల వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు. శరీరంలో అవసరమైనంత నీరు లేకపోయినా..బలహీనత ఉంటుంది. 

శరీరక బలహీనత దూరం చేసేందుకు లీన్ ప్రోటీన్లతో పుష్కలంగా ఉన్న పదార్ధాల్ని తీసుకోవాలి. దీనికోసం ఫ్రూట్స్ తప్పకుండా తినాలి. లీన్ ప్రోటీన్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. శరీరంలో బలహీనత ఉంటే..నట్స్, విత్తనాలు ఎక్కువగా తీసుకోవాలి. నట్స్‌లో కేలరీలు తక్కువగా ఉన్నందున సులభంగా జీర్ణమౌతాయి. రోజూ నట్స్ తీసుకుంటే..మీ బలహీనత క్షణాల్లో దూరమౌతుంది. 

Also read: Amla Health Benefits: వేగంగా బరువు తగ్గేందుకు ఉసిరితో అద్భుత ప్రయోజనాలు

 స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News