Amla Health Benefits: ప్రకృతిలో లభించే కాయల్లో విటమిన్ సి సమృద్ధిగా లభించేది ఉసిరికాయ. అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఉసిరికాయతో వేగంగా బరువు తగ్గవచ్చని చాలామందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం.
ప్రకృతిలో లభించే వివిధ రకాల కాయల్లో ఉసిరికాయలకు ఉన్న ప్రాముఖ్యత వేరు. ఆయుర్వేద శాస్త్రంలో ఉసిరికి ప్రత్యేక స్థానముంది. ఇది ఔషధ గుణాల పొదరిల్లు ఇది. అందుకే ఉసిరికాయ జ్యూస్ తాగితే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే ఉసిరికాయను విటమిన్ సికు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పవచ్చు. అంత సమృద్ధిగా విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి అనేది చాలా రకాల రోగాల్నించి కాపాడే అద్భుతమైన విటమిన్. అందుకే ఉసిరికాయ జ్యూస్ రోజూ డైట్‌లో చేర్చుకుంటే..అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కడుపు, లివర్‌లను ఆరోగ్యంగా ఉంచడంలో ఉసిరికాయ పాత్ర అమోఘమైంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే సీజనల్ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి విటమిన్ సి అద్భుతంగా పనిచేస్తుంది.
ఉసిరికాయ క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఉసిరిలో పుష్కలంగా ఉన్న పోషక పదార్ధాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంలో ఉసిరికాయలు సూపర్ ఫుడ్‌గా పనిచేస్తాయి. ఉదయం పరగడుపున ఉసిరి జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఇమ్యూనిటీ బాగుంటే..ఏ విధమైన రోగాలు చేరవు. అందుకే ఎప్పటికప్పుడు బలవర్ధకమైన ఆహార పదార్ధాల ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవల్సిన అవసరం ఉంటుంది.
ఉసిరితో వేగంగా బరువు తగ్గుదల
అంతేకాకుండా ఉసిరికాయతో ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంటారు. ఉదయం పరగడుపున ఉసిరి జ్యూస్ తీసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మరోవైపు బరువు తగ్గించడంలో ఉసిరి పాత్ర చాలా కీలకం. ఉసిరి జ్యూస్ రోజూ తీసుకుంటే బరువు వేగంగా తగ్గుతారు. ఉసిరి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెటబోలిజం వృద్ధి చెందుతుంది. మెటబోలిజం వృద్ధి చెందడమంటే స్థూలకాయానికి చెక్ పెట్టడమే.
Also read: Fungal Infections: వర్షాకాలంలో కాళ్లకు ఫంగస్ ఇన్‌ఫెక్షన్ ముప్పు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook