చలికాలంలో సహజంగానే ఇమ్యూనిటీ తగ్గి..త్వరగా వ్యాధులు సోకుతుంటాయి. దీనికితోడు దోమల బెడద కూడా అధికంగా ఉండటంతో డెంగ్యూ కేసులు పెరుగుతుంటాయి. నిర్లక్ష్యం చేస్తే డెంగ్యూ కాస్తా ప్రాణాంతకం కావచ్చు. డెంగ్యూ వ్యాధి నియంత్రణకు ఏం చేయాలనేది చూద్దాం..
డెంగ్యూ వ్యాధి లక్షణాలు
దేశంలో ఇటీవల డెంగ్యూ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. డెంగ్యూ వచ్చిందంటే చాలు..శరీరంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య వేగంగా తగ్గిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇది ప్రాణాంతకంగా మారుతుంది. డెంగ్యూలో ప్లేట్‌లెట్ కౌంట్ అనేది చాలా ముఖ్యమైనది. డెంగ్యూ కాకుండా ఇతరత్రా వ్యాధుల్లో కూడా ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గుతుంది కానీ..డెంగ్యూలో ఈ తగ్గుదల గంటల వ్యవధిలో జరిగిపోతుంది. తీవ్రమైన జ్వరం, ట్యాబ్లెట్ వేసినా తగ్గకపోవడం, తలనొప్పి, కడుపు నొప్పి, తీవ్రమైన నీరసం డెంగ్యూలో ప్రధాన లక్షణాలు.
ప్లేట్‌లెట్ కౌంట్ ఎంత ఉంటే మంచిది
డెంగ్యూ వ్యాధి సోకినప్పుడు ఆ వ్యక్తికి గంట గంటకూ ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోతుంటుంది. అటువంటప్పుడు తక్షణం ప్లేట్‌లెట్స్ ఎక్కించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. సాధారణంగా ఆరోగ్యవంతుడైన మనిషి శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 3-4 లక్షల వరకూ లేదా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది 80 వేల వరకూ పడిపోయినా ఎటువంటి నష్టం లేదు. కానీ 20 వేలకంటే దిగువకు పడిపోయినప్పుడు మాత్రం ప్రమాదకరంగా భావిస్తారు.
ప్లేట్‌లెట్స్ ఎలా ఎక్కిస్తారు
ఈ పరిస్థితుల్లో వెంటనే అదే గ్రూప్ బ్లడ్‌గ్రూప్‌కు సంబంధించి ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. బ్లడ్ బ్యాంకులో దాతలిచ్చిన రక్తం నుంచి మూడు అంశాల్ని వేరుచేస్తారు. ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను విడదీసి..వేర్వేరుగా ప్యాక్ చేస్తారు. ప్లేట్‌లెట్స్ అవసరమైనవారికి ఎక్కిస్తుంటారు.
ప్లేట్‌లెట్ కౌంట్ పెరగాలంటే ఏం చేయాలి
పూర్తిగా సహజసిద్ధ పద్దతిలో అందరికీ తెలిసిన చిట్కా ఉంది. ఈ పద్ధతి తక్షణం శరీరంలో ప్లేట్‌లెట్స్ కౌంట్‌ను పెంచుతుంది. బొప్పాయి చెట్టు లేత ఆకుల రసం. లేత ఆకుల్నించి ఎప్పటికప్పుడు కొద్దిగా రసాన్ని సేకరించాలి. 5 ఎంఎల్ నుంచి 10 ఎంఎల్ వరకూ ప్రతిరోజూ ఉదయం , రాత్రి తీసుకుంటే చాలా వేగంగా ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతుంది.
Also read: Eggs in Pregnancy: ప్రెగ్నెన్సీలో గుడ్లు తినవచ్చా లేదా, ఎలా తినాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook