Diabetes Tips: ఆదునిక జీవన విదానంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురౌతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, కిడ్నీ వ్యాధులు ఇందులో ప్రమాదకరమైనవి. ఈ అన్ని వ్యాధుల్లో మధుమేహం మరింత ప్రమాదకరం. కారణం చికిత్స లేకపోవడమే.
మధుమేహానికి చికిత్స లేకపోయినా నియంత్రణ మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది ఈ వ్యాధి తలెత్తేది కూడా నిర్లక్ష్యం కారణంగానే. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, జంక్ ఫుడ్స్ , ఫాస్ట్ ఫుడ్స్ , ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడంతో పాటు రోజూ తగిన నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. లేదా అసమతుల్యత ఏర్పడవచ్చు. అయితే ఈ లైఫ్‌స్టైల్ మార్చుకుని హెల్తీ ఫుడ్స్ సమయానికి తినడం, రోజూ పరిమిత సమయంలో వ్యాయామం లేదా వాకింగ్ చేయడం, సమయానికి నిద్రపోవడం చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. హెల్తీ పుడ్స్ విషయంలో చాలా రకాల ప్రత్యామ్నాయాలున్నాయి. అందులో ఒక ఆప్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రకాల పచ్చి కూరగాయలు తింటే మధుమేహం నియంత్రణలో ఉంటుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
క్యాబేజీ, బ్రోకలీ జాతి కూరలతో డయాబెటిస్ నియంత్రించవచ్చు. అయితే పచ్చిగా తీసుకోవల్సి వస్తుంది. సలాడ్ రూపంలో తీసుకుంటే తినేందుకు అనువుగా ఉండటమే కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. క్యాబేజీలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం వల్ల మధుమేహం నియంత్రణలో ఉపయోగపడుతుంది. ఇక పచ్చి బ్రోకలీ కూడా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. దీంతో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటమే కాకుండా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మధుమేహం తగ్గించేందుకు అద్బుతంగా ఉపయోగపడుతుంది.
ఆకుకూరల్లో బచ్చలి కూర మధుమేహం నియంత్రణకు అద్బుతంగా ఉపయోగపడుతుంది. ఇది కూడా పచ్చిగా తింటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. మరోవైపు పాలకూర కూడా మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉంటే విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియంల కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
క్యాప్సికమ్, బెండకాయ కూడా మధుమేహం వ్యాధిగ్రస్తులకు మంచి ఔషధంలా పనిచేస్తాయి. పచ్చిగా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అదనంగా లభిస్తాయి. క్యాప్సికమ్ , బెండకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచేందుకు ఉపయోగమౌతుంది. ఈ రెండింటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహం చాలావరకూ నియంత్రణలో ఉంటుంది.
Also read: Digestive System: మీ జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉందా, అయితే ఈ 5 వ్యాధులు రావచ్చు జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Diabetes Tips: మీ డైట్‌లో ఈ 5 పచ్చి కూరగాయలుంటే చాలు..డయాబెటిస్ ఎంతున్నా ఇట్టే మాయం