Digestive System: మీ జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉందా, అయితే ఈ 5 వ్యాధులు రావచ్చు జాగ్రత్త

Digestive System: శరీరంలో అతర్గతంగా జరిగే మార్పులు వివిద రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంటాయి. దాదాపు అన్ని వ్యాధులు ఏదో రూపంలో సంకేతాలిస్తుంటాయి. కొన్ని లక్షణాల్ని మనం పట్టించుకోమంతే. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 29, 2023, 05:31 PM IST
Digestive System: మీ జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉందా, అయితే ఈ 5 వ్యాధులు రావచ్చు జాగ్రత్త

Digestive System: చాలామంది జీర్ణ వ్యవస్థను చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ శరీరంలోని అతి ముఖ్యమైన వ్యవస్థల్లో ఇదొకటి. జీర్ణ వ్యవస్థ బలహీనమైతే ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే జీర్ణ వ్యవస్థ ఎప్పుడూ సక్రమంగా ఉండేట్టు చూసుకోవాలి. 

జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేకపోతే ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యగా మారి ఇతర అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. జీర్ణ వ్యవస్థను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. మనిషి ఆరోగ్యాన్ని కాపాడేది, ఫిట్ అండ్ హెల్తీగా ఉంచేది ఈ వ్యవస్థే. జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురౌతాయో తెలుసుకుందాం.

జీర్ణ వ్యవస్థ బలహీనమైతే కచ్చితంగా శరీరంలో పౌష్ఠిక గుణాల లోపం ఏర్పడుతుంది. తిన్న ఆహరం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల అందులోని పోషకాలు శరీరానికి అందవు. ఫలితంగా తీవ్రమైన అలసట, నీరసం వంటివి ఉంటాయి.  జీర్ణక్రియ బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి మలబద్ధకం సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. తినే ఆహారం సరిగ్గా అరగకపోతే ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. మల విసర్జనకు ఇది ఇబ్బందిగా మారుతుంది. 

జీర్ణక్రియ బలహీనంగా ఉంటే ఆ వ్యక్తికి కడుపులో గ్యాస్, ఎసిడిటీ సమస్య ఉత్పన్నం కావచ్చు. జీర్ణం సరిగ్గా లేకపోతే శరీరంలో ఇతర ప్రక్రియలు కూడా మందగిస్తాయి. ఎప్పుడైతే ఆహారం త్వరగా జీర్ణం కాలేదో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ప్రారంభమౌతాయి. జీర్ణ క్రియ బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి కడుపు, ప్రేవుల్లో స్వెల్లింగ్ రావచ్చు. 

Also read: Tulsi Benefits: తులసి ఆకుల్లో ఓలియానోలిక్ యాసిడ్‌తో ఈ 16 వ్యాధులు మటుమాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News