Liver Health tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కన్పిస్తుంటే..నిర్లక్ష్యం వద్దు, ప్రమాదకర ఫ్యాటీ లివర్ వ్యాధి కావచ్చు

Liver Health tips: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి లివర్. గుండె, కిడ్నీలు ఎంత అవసరమో కాలేయం కూడా అంతే అవసరం. ఎందుకంటే ఇదొక ఫ్యాక్టరీ లాంటిది. ఇందులో ఏ చిన్న సమస్య తలెత్తినా మొత్తం వ్యవస్థపై ప్రభావం పడుతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 26, 2023, 07:19 PM IST
Liver Health tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కన్పిస్తుంటే..నిర్లక్ష్యం వద్దు, ప్రమాదకర ఫ్యాటీ లివర్ వ్యాధి కావచ్చు

Liver Health tips: మనిషి శరీరంలో గుండె, కిడ్నీలతో పాటు అత్యంత విలువైంది కాలేయం. శరీరంలోని వివిధ ప్రక్రియలు సజావుగా జరిగేందుకు ఉపయోగపడుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉన్నంతవరకూ శరీరంలోని వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. లివర్‌లో ఏదైనా సమస్య తలెత్తితే ఒక్కొక్క సమస్యా బయటపడుతుంటుంది. 

మనిషి శరీరంలో లివర్ అంత ముఖ్యమైన అంగం. లివర్ రోజుకు నిర్వహించే విధుల సంఖ్య తెలిస్తే ఆశ్చర్యపోతారు. రోజుకు 500 విధుల్ని నిర్వర్తిస్తుంది. శరీరంలోని వివిధ రకాల విష పదార్ధాలను సమర్ధవంతంగా బయటకు తొలగించేది లివర్ మాత్రమే. అందుకే లివర్‌ను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. లివర్‌పై సాధ్యమైనంతవరకూ ఒత్తిడి ఎక్కువగా ఉండకుండా చూడాలి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి సంక్రమిస్తే హెపటైటిస్, లివర్ సిరోసిస్ వంటి సీరియస్ వ్యాధుల ముప్పు పెరుగుతుంది. 

కేవలం మద్యం సేవించేవారికే కాదు..మద్యం సేవించకపోయినా ఈ వ్యాధి తలెత్తవచ్చు. సకాలంలో లక్షణాలను గుర్తించి చికిత్స చేయిస్తే చాలా త్వరగా ఈ వ్యాధిని నయం చేయవచ్చు. ఆ  లక్షణాలు ఇలా ఉంటాయి. తీవ్రమైన అలసట ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటే తీవ్రమైన అలసట, బలహీనత ఉంటుంది.

మరో ప్రధాన లక్షణం కడుపులో భారంగా ఉండటం. మల విసర్జనలో ఇబ్బంది కలగడం ఉంటుంది. జీర్ణక్రియ సరిగ్గా లేక అసౌకర్యంగా ఉంటుంది. ఇవన్నీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లక్షణాలే. దీనికితోడు కడుపు పైభాగంలో నొప్పి ఉంటుంది. మందులు వేసుకున్నా తగ్గని పరిస్థితి ఉంటుంది. 

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటే అరచేతులు ఎర్రగా మారుతుంటాయి. అజీర్తి సమస్య వెంటాడుతుంది. కడుపులో గ్యాస్ ఏర్పడటం, జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం, గుండెల్లో మంట, తేన్పులు రావడం వంటివి తరచూ కన్పించే సమస్యలు. ఇవన్నీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లక్షణాలే. కడుపులో ఉబ్బరంగా ఉంటుంది. సిరోసిస్ కేసుల్లో 80 శాతం మందికి ఈ సమస్య ప్రధానంగా ఉంటుంది. 

Also read: Lemon Tips: నిమ్మకాయను ఈ పదార్ధాలతో కలపకూడదని తెలుసా, ఇలా సేవిస్తే జీవితకాలం పెరగడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News