Almond Benefits: బాదం అనేది ఆరోగ్యకరమైన పౌష్ఠిక ఆహారం. బాదంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీజన్‌తో సంబంధం లేకుండా తీసుకోవచ్చు గానీ వేసవిలో కాస్త అప్రమత్తత పాటించాలి. ఆ వివరాలు మీ కోసం..
బాదంను ఏ రూపంలో ఎలాగైనా తీసుకోవచ్చు. కానీ వేసవిలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు వైద్య నిపుణులు. ఎందుకంటే వేసవిలో సహజంగా జీర్ణక్రియ కాస్త మందగిస్తుంది. ఈ నేపధ్యంలో పచ్చి బాదం అరిగించుకోవడం ఇబ్బందిగా మారుతుంటుంది. దాంతో స్వెల్లింగ్, గ్యాస్, కడుపు సమస్యలు ఉత్పన్నమౌతాయి. మరి బాదంను ఎండాకాలంలో ఎలా తింటే మంచిది, పచ్చిది తినాలా లేదా నానబెట్టి తినాలా అనే సందేహం చాలామందిలో ఉంటుంది.
వేసవిలో సాధ్యమైనంతవరకూ నానబెట్టిన బాదం తినడమే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. బాదంను రాత్రంతా నీళ్లలో నానబెట్టడజం వల్ల తొక్క సులభంగా తొలగించవచ్చు. బాదంలో పోషకాలు కూడా పెరుగుతాయి. దీంతోపాటు నానబెట్టిన బాదం జీర్ణం సులభమౌతుంది. వేసవిలో శరీరానికి చలవ అందిస్తుంది. పచ్చి బాదం తినడం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది అవుతుంది. అందుకే బాదం నానబెట్టి తినడం చేస్తే జీర్ణక్రియకు ఇబ్బంది కలగదు. అటు ఆరోగ్యపరంగా ఎక్కువ లాభాలుంటాయి. ఇందులోని పోషకాలు కూడా జీర్ణమయ్యేందుకు వీలు కలుగుతుంది.
బాదం నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
గుండె ఆరోగ్యం
బాదం ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్త్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది.
ఎముకలకు బలం
నానబెట్టిన బాదం రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల శరీర నిర్మాణంలో కీలకమైన ఎముకలకు కావల్సిన కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు కావల్సిన పరిణామంలో లభిస్తాయి.
స్వెల్లింగ్ తగ్గించడం
బాదంను నానబెట్టి తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి స్వెల్లింగ్ తగ్గించేందుకు దోహదపడతాయి. మరీ ముఖ్యంగా పాత అనారోగ్య సమస్యలు దూరమౌతాయి.
జీర్ణక్రియ
పచ్చి బాదంతో పోలిస్తే నానబెట్టిన బాదం త్వరగా జీర్ణమౌతుంది. ఎందుకంటే బాదం నానబెట్టినప్పుడు తొక్కలో ఉండే ట్యానిన్ లెవెల్స్ తగ్గిస్తుంది. పోషకపదార్ధాల జీర్ణానికి ఉపయోగపడుతుంది.
మెదడు పనితీరు
నానబెట్టిన బాదం తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా పనితీరును వేగవంతం చేస్తాయి.
Also read: Kidney life Tips: ఆ అలవాట్లు మానుకోకపోతే మీ కిడ్నీ లైఫ్ తగ్గిపోతుంది జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook