Typhoid Precautions: పెరుగుతున్న టైఫాయిడ్ కేసులు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, లక్షణాలెలా ఉంటాయి

Typhoid Precautions: సాధారణంగా వర్షాకాలం అంటేనే వివిధ రకాల వ్యాధుల భయం వెంటాడుతుంది. సీజనల్ వ్యాధులు ఎక్కువ. వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇలా అన్ని రకాల సమస్యలు వెంటాడుతుంటాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 8, 2023, 08:41 PM IST
Typhoid Precautions: పెరుగుతున్న టైఫాయిడ్ కేసులు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, లక్షణాలెలా ఉంటాయి

Typhoid Precautions: ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం, నీరు కలుషితం కావడంతో వ్యాధుల ముప్పు పెరిగిపోయింది. ప్రధానంగా టైఫాయిడ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. టైఫాయిడ్ ఎలా సంక్రమిస్తుంది, ఎలా నివారించాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం..

టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్. సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టిరీయా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. నిల్వ ఉన్న ఆహరం, కలుషితమైన నీరు తాగడం వల్ల పేగుల్లో పుండ్లు ఏర్పడి టైఫాయిడ్ వ్యాధిగా పరిణమిస్తుంది. ఈ వ్యాధి సంక్రమించినప్పుడు హై టెంపరేచర్, చలి, చెమట పట్టడం, ఆకలి లేకపోవడం, వాంతులు, గొంతు బొంగురుపోవడం, తలనొప్పి, చలి, దగ్గు వంటి లక్షణాలు ప్రధానంగా కన్పిస్తాయి. 

టైఫాయిడ్‌లో తీసుకోవల్సిన జాగ్రత్తలు

టైఫాయిడ్ ప్రధానంగా పారిశుద్ధ్య లోపంతో వస్తుంది. అందుకే ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డీ హైడ్రేషన్ సమస్య తలెత్తకుండా నీళ్లు ఎక్కువగా సేవించాలి. టైఫాయిడ్ నుంచి ఉపశమనం పొందేందుకు అల్లం, తులసి టీ ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా దగ్గు, జలుబును అద్బుతంగా తగ్గిస్తుంది. 

తులసి ఆకులతో కూడా టైపాయిడ్ తగ్గించవచ్చు. కొన్ని తులసి ఆకులు తీసుకుని అందులో కొద్దిగా వేపరసం, చిన్న మిరియాలు, కొద్దిగా అల్లం వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసు నీళ్లలో వేసి బాగా మరిగించాలి. రోజుకు 2-3 సార్లు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఇది తాగిన అరగంట ముందు తరువాత ఏం తినకూడదు. అదే సమయంలో వెల్లుల్లి కూడా టైఫాయిడ్ చికిత్సలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది సహజసిద్ధమైన యాంటీ బయోటిక్. కొన్ని వెల్లుల్ని రెమ్మల్ని గుజ్జుగా చేసి నూనె లేదా నెయ్యిలే వేయించాలి. ఇప్పుడిందులో సింథనం కలిపి తాగితే టైఫాయిడ్ జ్వరం తగ్గిపతుంది. రోజుకు రెండుసార్లు తాగాల్సి ఉంటుంది. 

ఇక టైఫాయిడ్ రోగికి తేలికపాటి ఆహారం పెట్టాలి. ఎందుకంటే టైఫాయిడ్ ఉన్నప్పుడు జీర్ణక్రియ బలహీనమౌతుంది. అందుకే తేలికపాటి ఆహారమైతే త్వరగా జీర్ణం కాగలదు. తినేటప్పుడు చుట్టుపక్కల పరిశుభ్రత పాటించాలి. తినే ఆహారంపై ఈగలు వంటివి వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి ఆహారం పూర్తిగా మానేయడమే మంచిది. బయట తినాల్సివస్తే వేడి వేడిగా మాత్రమే తినాలి. 

Also read: Diabetes Control Tips: డయాబెటిస్‌కు ఆ పండు చాలా డేంజర్, కానీ ఆకులు మాత్రం అద్భుతమైన ఔషధమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News