Banana Side Effects: ఈ 5 సమస్యలున్నవాళ్లు అరటి పండ్లకు దూరంగా ఉండాల్సిందే

Banana Side Effects: పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రకృతిలో లభించే వివిధ రకాల ఫ్రూట్స్‌లో చాలా రకాల పోషక పదార్ధాలుంటాయి. అయితే కొంతమంది మాత్రం కొన్ని రకాల పండ్లు తీసుకోకూడదు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 10, 2023, 04:13 PM IST
Banana Side Effects: ఈ 5 సమస్యలున్నవాళ్లు అరటి పండ్లకు దూరంగా ఉండాల్సిందే

అరటి పండ్లు అంటే ఇష్టం లేనివారెవరూ ఉండరు. అందరికీ అత్యంత ఇష్టమైనవి ఇవి. ఇందులో ఉండే పోషకల దృష్ట్యా సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. కానీ కొంతమందికి మాత్రం హాని కలిగిస్తుందంటారు వైద్య నిపుణులు. 

అరటి పండ్లను శక్తివంతమైన పౌష్ఠికాహారంగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇష్టంగా తినేది కూడా ఇదే. అరటి పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దాదాపు అందరికీ తెలిసినవే. అయితే కొంతమంది మాత్రం అరటి పండ్లకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అరటి పండ్లతో ఎలర్జీ ఉండేవాళ్లు పొరపాటున కూడా తీసుకోకూడదు. ఎలర్జీ ఉన్నవాళ్లు అరటి పండ్లు తినడం వల్ల స్వెల్లింగ్, శ్వాస ఇబ్బంది, ఎనాఫిలెక్సిస్ వంటి తీవ్ర లక్షణాలు ఉత్పన్నమౌతాయి.

మధుమేహం

అరటి పండ్లలో సహజసిద్ధమైన పంచదార ఉంటుంది. ఫలితంగా మధుమేహం లేదా బ్లడ్ షుగర్ రోగులు పొరపాటున కూడా తినకూడదు. ఒకవేళ తినాల్సి వస్తే బాగా పండినవి అస్సలు తినకూడదు. 

కిడ్నీ

అరటి పండ్లలో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. కిడ్నీ సమస్య ఉన్న వ్యక్తులకు హానికారకం ఇవి. శరీరంలో అదనంగా ఉన్న పొటాషియం బయటకు తొలగించడంలో సమస్య వస్తుంది. అందుకే కిడ్నీ సమస్యలున్నవాళ్లు అరటి పండ్లకు దూరంగా ఉండాలి.

మలబద్ధకం

కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం సమస్యతో బాధపడేవాళ్లు అరటి పండ్లు తినకూడదు. ఎందుకంటే అరటి పండ్లు మలబద్ధకం సమస్యను తగ్గించాల్సింది పోయి..పెంచుతుంది.

ఆస్తమా

ఆస్తమా రోగులకు అరటి పండ్లు మంచివి కావు. ఆస్తమా రోగులు అరటి పండ్లు తినడం వల్ల సమస్య మరింతగా పెరిగిపోతుంది. అందుకే ఆస్తమా రోగులు అరటి పండ్లకు దూరంగా ఉండాలి.

Also read: Best Weight Loss Tips 2023: బరువు తగ్గే క్రమంలో రాత్రి ఆహారాలు మానుకుంటున్నారా! ఇక ప్రమాదమేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News