Diabetes Recipe: మధుమేహ వ్యాధిగ్రస్థులకు దివ్యౌషధంలా పనిచేసే డ్రై ఫ్రూట్ రోల్, ఎలా చేయాలంటే

Diabetes Recipe: ఆధునిక జీవనశైలిలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా ఉన్నది డయాబెటిస్. ఈ సమస్యను ఎంత త్వరగా నియంత్రించగలిగితే అంత మంచిది. డయాబెటిస్ నియంత్రణ పూర్తిగా డైట్‌పైనే ఆధారపడి ఉంటుంది. దీనికోసం అద్భుతమైన డైట్ ప్లాన్ మీ కోసం అందిస్తున్నాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 7, 2023, 08:13 PM IST
Diabetes Recipe: మధుమేహ వ్యాధిగ్రస్థులకు దివ్యౌషధంలా పనిచేసే డ్రై ఫ్రూట్ రోల్, ఎలా చేయాలంటే

Diabetes Recipe: డయాబెటిస్ రోగుల్లో సాధారణంగా నీరసం ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ మారిపోతుంటాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్థులు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. అది కూడా ఫైబర్ రిచ్, లో కేలరీ ఫుడ్ అయుండాలి. ఎందుకంటే ఇమ్యూనిటీ బలంగా ఉండటం ముఖ్యం. 

డయాబెటిస్ రోగులకు ఎప్పటికప్పుడు ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇవ్వడమే కాకుండా షుగర్ ఫ్రీ డైట్ అవసరమౌతుంది. దీనికోసం డ్రై ఫ్రూట్ రోల్ అద్భుతంగా ఉపయోగపడుతుందంటున్నారు డైటిషియన్లు. ఇదొక షుగర్ ఫ్రీ పదార్ధం. డ్రై ఫ్రూట్ రోల్ పాలతో తీసుకుంటే శరీరానికి మరింత బలం చేకూరుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే మరి కొద్దిరోజుల్లో సీజన్ మారనుంది. సీజన్ మారిన ప్రతిసారీ వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు చుట్టుముడుతుంటాయి. డయాబెటిస్ రోగులు వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉండాలి. అందుకే ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్ధాలు అందులో లో కేలరీ, లో షుగర్ పుడ్స్ తీసుకోవాలి. అందుకే డ్రై ఫ్రూట్ రోల్ మధుమేహ వ్యాధిగ్రస్థులకు మంచి ఆహారం కాగలదు. ఇది ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇస్తుంది. డ్రై ఫ్రూట్ రోల్‌ను ఖర్జూరంతో చేయడం వల్ల ఇది షుగర్ ఫ్రీ అవుతుంది. పాలతో తింటే మరింత బలం చేకూరుతుంది. డ్రై ఫ్రూట్ రోల్ ఎలా చేయాలో తెలుసుకుందాం..

డ్రై ఫ్రూట్ రోల్ తయారీ ఇలా

డ్రై ఫ్రూట్ రోల్ తయారు చేసేందుకు ఒక కప్పు ఖర్జూరం, , 4-5 స్పూన్ల జీడిపప్పు లేదా నట్స్ లేదా పిస్తా, అర స్పూన్ దాల్చిన చెక్క, ఇలాచీ పౌడర్, 2 స్పూన్ల నెయ్యి, 1.5 స్పూన్ల గసగసాలు అవసరమౌతాయి. ముందుగా ఖర్జూరం గింజలు వేరు చేసి ముక్కలుగా చేసుకోవాలి. ఖర్జూరం బాగా డ్రైగా ఉండే కొద్దిగా వేడి నీళ్లు వేయాలి. తరువాత ఓ గిన్నెలో గసగసాలు వేసి స్లో ఫ్లేమ్‌లో 1 నిమిషం వేపాలి. ఆ తరువాత స్టౌవ్ నుంచి దింపి వేరు చేయాలి. అదే గిన్నెలో 1 టీ స్పూన్ నెయ్యి వేసి కరిగించాలి. ఇందులో జీడిపప్పు లేదా వాల్‌నట్స్ లేదా పిస్తా డ్రై ఫ్రూట్ వేపాలి. ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ వేసి మరోసారి వేపాలి. ఆ తరువాత డ్రై ఫ్రూట్స్ గిన్నెలోనే పక్కకు చేసి మరో స్పూన్ నెయ్యి వేయాలి. ఇందులో కోసిన ఖర్జూరం, గసగసాలు, దాల్చిన చెక్క పౌడర్ వేయాలి. అన్నీ కలిపి స్లో ఫ్లేమ్‌లో కాస్సేపు ఉంచాలి. ఆ తరువాత మిక్సర్ రోల్ చేసి పైన గసగసాల కోటింగ్ ఇవ్వాలి. ఇప్పుడు తయారైన రోల్‌ను ఫాయిల్ పేపర్‌లో చుట్టి కాస్సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. చివరిగా రోల్ స్లైసెస్ చేసి తినాలి. 

ఈ రోల్ వారానికి కనీసం 4-5 సార్లు తింటే ఇమ్యూనిటీ వేగంగా పెరగడమే కాకుండా ఏ విధమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు దూరమౌతాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఎనర్జీ ఇచ్చే అద్భుతమైన ఫుడ్ ఇది. 

Also read: Thyroid Tips: థైరాయిడ్ సమస్యకు డైట్ ఒక్కటే సమాధానం, ఏది తినాలి, ఏది తినకూడదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News