Breathing Tips: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే రోజూ ఇలా చేయండి

Breathing Tips: ఇటీవలి కాలంలో ఊపిరితిత్తుల సమస్య అధికమౌతోంది. జీవనశైలి సక్రమంగా లేకపోవడం, ఒత్తిడి కారణంగా లంగ్స్ బలహీనపడుతున్నాయి. అయితే ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా, బలంగా మార్చేందుకు కొన్ని పద్ధతులున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 14, 2024, 10:39 PM IST
Breathing Tips: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే రోజూ ఇలా చేయండి

Breathing Tips: మనిషి శ్వాస ఉన్నంతవరకే ప్రాణంతో ఉంటాడు. అయితే మనం తీసుకునే శ్వాస సరిగ్గా ఉందా అనేది తెలుసుకోవడం చాలా అవసరం.  ఉరుకులు పరుగుల జీవితం కారణంగా ఊపిరితిత్తులు పాడవుతున్నాయి. చాలా రకాల వ్యాధులకు కారణమౌతుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కాలుష్యం, జీవనశైలి సక్రమంగా లేకపోవడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటున్న పరిస్థితి కన్పిస్తోంది. అయితే కొన్ని బ్రీతింగ్ పద్ధతులు పాటించడం ద్వారా ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.

డీప్ బ్రీతింగ్

డీప్ బ్రీతింగ్ అనేది అద్భుతమైన, శక్తివంతమైన వ్యాయామ పద్ధతి. నేరుగా కూర్చుని భుజాలు వదులుగా ఉంచుకోవాలి. నెమ్మది నెమ్మదిగా డీప్ బ్రీత్ తీసుకోవాలి. కడుపు పైకొచ్చేలా శ్వాస తీసుకుని కొన్ని సెకన్లు అలానే శ్వాస నిలబెట్టుకోవాలి. నెమ్మది నెమ్మదిగా శ్వాస వదులుతూ ఉండాలి. ఇలా రోజుకు 5-10 సార్లు చేయాలి

మరో పద్దతి ఏంటంటే విశ్రాంతిగా కూర్చుని కళ్లు మూసుకోవాలి. ముక్కుతో లోతుగా శ్వాస పీల్చుకోవాలి. శ్వాస నెమ్మదిగా వదలాలి. ఈ ప్రక్రియను సైతం రోజుకు 5-10 సార్లు చేయాలి.

అరోహణ అవరోహణ పద్దతిలో చేసే ప్రాణాయామం మరో పద్ధతి. ఇందులో ఒక్కొక్కటిగా రెండు నాసికా రంధ్రాలతో శ్వాస పీల్చుకుని నెమ్మదిగా వదలాలి. మధ్య వేలుతో కుడి నాసికను క్లోజ్ చేసి రెండో రంద్రంతో డీప్ బ్రీత్ తీసుకోవాలి. తరువాత  ఎడమ వైపు క్లోజ్ చేసి కుడివైపు నాసికా రంధ్రంతో శ్వాస పీల్చుకోవాలి. ఇలా రోజుకు 5-10 సార్లు చేయాలి

మరో పద్ధతి పఫింగ్. ఇందులో బుగ్గల్ని గాలితో నింపాలి. హాయిగా కూర్చుని నోరు మూసుకుని ముక్కుతో డీప్ బ్రీత్ తీసుకోవాలి. నోటి నిండా గాలి నింపుకుని కాస్సేపు ఉండాలి. నెమ్మది నెమ్మదిగా వదులుకోవాలి. ఈ ప్రక్రియను రోజుకు 5-10 సార్లు చేయాలి.

ఇక ఊపిరితిత్తులు పటిష్టంగా ఉంచే మరో పద్ధతి మెట్లెక్కడం.  మెట్లు ఎక్కేటప్పుడు లోతుగా శ్వాస తీసుకోవాలి. మెట్లు దిగేటప్పుడు శ్వాస వదలాలి. ఇలా రోజూ చేయాలి. ఈ ఐదు పద్ధతులు పాటించడం ద్వారా ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా, బలంగా మార్చుకోవచ్చు,.

Also read: Badam Milk: బాదం పాలు ఆరోగ్యానికి ఎంతవరకూ మంచివి, నష్టాలు కూడా ఉన్నాయా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News