Heart Attack Risk: గుండె పోటు లక్షణాలేంటి, మహిళలు, పురుషుల్లో ఎవరికి హార్ట్ ఎటాక్ ముప్పు అధికంగా ఉంటుంది

Heart Attack Risk: ఇటీవలి కాలంలో గుండె పోటు, గుండె వ్యాధులు ఎక్కువౌతున్నాయి. గుండె కండరాలకు కావల్సినంత ఆక్సిజన్ అందనప్పుడు ఈ పరిస్థితి ఎదురౌతుంది. గుండె వ్యాధుల ముప్పు మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 20, 2024, 06:30 PM IST
Heart Attack Risk: గుండె పోటు లక్షణాలేంటి, మహిళలు, పురుషుల్లో ఎవరికి హార్ట్ ఎటాక్ ముప్పు అధికంగా ఉంటుంది

Heart Attack Risk: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా గుండె పోటు సమస్య అధికంగా కన్పిస్తోంది. అదే సమయంలో గుండె వ్యాధుల ముప్పు మహిళల్లో ఎక్కువగా ఉంటుందా , పురుషుల్లో ఎక్కువగా ఉంటుందా అనే చర్చ విన్పిస్తోంది. ఈ నేపధ్యంలో గుండె వ్యాధి లక్షణాల గురించి పరిశీలిద్దాం.

గుండె వ్యాధుల ముప్పు మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువగా ఉంటుందనే వాదన వాస్తవానికి నిజం కాదు. కానీ ఇరువురిలో గుండె పోటు లక్షణాలు మాత్రం కాస్త విభిన్నంగా ఉండవచ్చు. అసలు గుండె పోటుకు దారితీసే కారణాలు మహిళల్లో ఎలా ఉంటాయి, పురుషుల్లో ఎలా కన్పిస్తాయనేది చూద్దాం.

మహిళల్లో గుండె పోటు ముప్పు 55 ఏళ్లు దాటితే ఎక్కువగా కన్పిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ ఉంటే మీలో ఆ ముప్పు ఉండవచ్చు. అధిక రక్తపోటు మరో ప్రధాన కారణం. మధుమేహం వ్యాధిగ్రస్థుల్లో ఈ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే నరాల్లో ఫ్లక్ పేరుకుపోతుంది. ఇది కూడా గుండె వ్యాధులకు కారణమౌతుంది. స్థూలకాయం మరో ప్రధాన సమస్య. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆందోళన, స్ట్రెస్ తగ్గించుకోవాలి. లేకపోతే గుండె వ్యాదుల ముప్పు పెరుగుతుంది. 

పురుషుల్లో హార్ట్ ఎటాక్ ముప్పు 45 ఏళ్లు దాటితే ప్రారంభమైపోతుంది. కుటుంబంలో ఎవరికైనా ఉంటే మీక్కూడా ఆ పరిస్థితి రావచ్చు. అధిక రక్తపోటు గుండె వ్యాధికి ప్రధాన కారణం. మధమేహం వ్యాధిగ్రస్థుల్లో ముప్పు అధికంగా ఉంటుంది. హై కొలెస్ట్రాల్ కూడా గుండె వ్యాధుల ముప్పును పెంచుతుంది. ధూమపానం మరో ప్రధాన కారణంగా ఉంటుంది. స్థూలకాయం, వ్యాయామం చేయకపోవడం కూడా గుండె వ్యాధులకు కారణమౌతుంది. 

హార్ట్ ఎటాక్ ప్రాధమిక లక్షణాలు

ఛాతీలో నొప్పి, పట్టేసినట్టుండటం, ఒత్తిడి ప్రధానంగా కన్పిస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురౌతుంది. వాంతులు లేదా వికారంగా ఉంటుంది. చల్లని చెమట్లు పడుతుంటాయి. తల తిరగడం, తేలిగ్గా అనుభూతి చెందడం ఉంటుంది. భుజాలు, మెడ, చేతి నొప్పి కన్పిస్తుంది. 

Also read: Samsung Galaxy S23 Offer: 50MP ట్రిపుల్ కెమేరా, 8GB ర్యామ్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సగం ధరకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News