Heart Attack Signs in Women: మహిళల్లో గుండె పోటు లక్షణాలు ఎలా ఉంటాయి. ఎందుకు భిన్నంగా ఉంటాయి

Heart Attack Signs in Women: ఇటీవలి కాలంలో గుండె పోటు వ్యాధులు, గుండె పోటు మరణాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కన్పిస్తుంటాయి. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించగలగాలి. అప్పుడే గుండె పోటు ముప్పును తగ్గించుకోవచ్చు. లేదా గుండెపోటు నుంచి బయటపడేందుకు అవకాశముంటుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 1, 2024, 11:01 AM IST
Heart Attack Signs in Women: మహిళల్లో గుండె పోటు లక్షణాలు ఎలా ఉంటాయి. ఎందుకు భిన్నంగా ఉంటాయి

Heart Attack Signs in Women: అయితే గుండె పోటు లక్షణాలు ఎలా ఉంటాయి, మహిళల్లో, పురుషుల్లో ఒకేలా ఉంటాయా, వేర్వేరుగా ఉంటాయా..అంటే కచ్చితంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు లక్షణాలు బిన్నంగా ఉంటాయంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం.

అసలు గుండె పోటు ఎందుకొస్తుంది, కారణాలేంటని పరిశీలిస్తే చాలా అంశాలే బయటపడుతుంటాయి. అన్నింటికంటే ప్రధాన కారణం గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళం బ్లాక్ అవడం. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు సహజంగానే రక్తపోటు పెరుగుతుంది. ఇది కాస్తా హార్ట్ ఎటాక్ సమస్యకు దారి తీయవచ్చు. ఇలా చాలా అంశాలుంటాయి. అందుకే గుండెకు రక్తం సరఫరా సక్రమంగా ఉండేట్టు చూసుకోవడం చాలా అవసరం. అసలు మహిళల్లో గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు పరిశీలిద్దాం. 

ఛాతీ నొప్పి పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా కన్పిస్తుంది. దీనిని ఛాతీపై ఒత్తిడిగా పరిగణిస్తుంటారు. కొంతమంది మహిళలకు దవడ, మెడ, భుజం, ఎగువ వీపు, బొడ్డు ఎగువ భాగంలో నొప్పి ఉంటుంది. ఇవి కూడా గుండెపోటు వచ్చే ముందు మహిళల్లో ప్రత్యేకంగా కన్పించే లక్షణాలు. ఇక పురుషుల్లో, మహిళల్లో సాధారణంగా కన్పించే మరో లక్షణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస సరిగ్గా ఆడకపోవడం. ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనై వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. 

మహిళల్లో వికారం, వాంతులు, చెమట్లు పట్టడం, తల తిరగడం, అలసట వంటి లక్షణాలతో పాటు దిగువ కాలిభాగంలో, చీలమండల భాగంలో వాపు కన్పిస్తుంది. హార్ట్ బీట్ వేగంగా ఉండటమే కాకుండా నొప్పి ఉంటుంది. ఒక్కోసారి మూర్చ కూడా వస్తుంటుంది. ఈ లక్షణాలు కన్పిస్తే మహిళలు అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే మహిళల్లో చాలావరకు గుండెపోటు నిశ్శబ్దగంగా వస్తుంటుంది. అలాంటప్పుడు ప్రాణాలు పోయే అవకాశముంటుంది. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ పరిస్థితిని నివారించేందుకు ముందు చేయాల్సింది ఆందోళన, ఒత్తిడి దూరం చేసుకోవాలి. ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండేట్టు అలవాటు చేసుకోవాలి. ఇక రోజూ తేలికపాటి వ్యాయామం లేదా వాకింగ్ అవసరం. అన్నింటికీ మించి ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

Also read: Dates and Ghee Benefits: నెయ్యిలో ఖర్జూరం నానబెట్టి తింటే ఏమౌతుందో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News