High Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం అంటే గుండెపోటు ముప్పు పెరుగుతున్నట్లే లెక్క. ఇటువంటి సమయంలోనే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో మీ ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలంటే...ముందుగా మీ తీసుకునే ఆహారాన్ని మార్చాలి. ఎందుకంటే కొంతమంది ఎలాంటి పుడ్ పడితే అలాంటి పుడ్ తీసుకుంటారు. దీని వల్ల శరీరంలో కొవ్వుకు పేరుకుపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చెడు కొలెస్ట్రాల్ (High Cholesterol symptoms) పెరగడానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చెడు ఆహారపు అలవాట్లు
మెుదటగా మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో గమనించాలి. ఎందుకంటే మీరు తినే ఆహారం శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మీరు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు మీ ఆహారంలో ఎక్కువ పచ్చి కూరగాయలను చేర్చుకోండి, దీని వల్ల మీరు ప్రయోజనం పొందుతారు.
ఊబకాయం
మీ బరువు పెరిగినప్పుడు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉందని తెలుసుకోండి. దీనిని అరికట్టడానికి మీరు నిరంతరం వ్యాయామం చేయాలి.
మద్యం మరియు ధూమపానం
మద్యపానంతో పాటు పొగ తాగితే ఆరోగ్యంతో ఆడుకుంటున్నట్టే.. ఎందుకంటే ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు అని అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో ఈ రెండింటినీ మీరు తగ్గించుకోవాలి. లేకపోతే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి