COPD: నడిస్తే ఆయాసం వస్తోందా? ఇలా చేస్తే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది..

COPD: కొంతమందికి పొల్యూషన్ వల్ల శ్వాససంబంధిత సమస్యలు వస్తాయి. మరికొందరికీ గాలి వల్ల సమస్యలు వస్తాయి. దీన్ని COPD (chronic obstructive pulmnery disease) అంటారు.

Written by - Renuka Godugu | Last Updated : Feb 18, 2024, 09:17 AM IST
COPD: నడిస్తే ఆయాసం వస్తోందా? ఇలా చేస్తే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది..

COPD: కొంతమందికి పొల్యూషన్ వల్ల శ్వాససంబంధిత సమస్యలు వస్తాయి. మరికొందరికీ గాలి వల్ల సమస్యలు వస్తాయి. దీన్ని COPD (chronic obstructive pulmnery disease) అంటారు.

ఆయాసం రావడానికి కారణాలు..
మొదటిది గుండె సమస్య, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు,కాలేయ సమస్య,రక్తహీనత,
గుండెసమస్య అంటే ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే ఈ సమస్య ఉంటుంది.
అంతేకాదు మానసిక సమస్యలు ఉన్నవారికి కూడా అస్తమా రావచ్చు. ఊపిరితిత్తుల వల్ల ఆయాసం వస్తే గాలి బయటకు వచ్చినప్పుడు పిల్లీ కూత వస్తుంది. రక్తహీనత వల్ల వచ్చే ఆయాసం గర్భిణీ స్త్రీలకు ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోకపోవడం. రక్తహీనతకు ప్రధాన కారణం ఐరన్, ఫోలిక్ యాసిడ్ లోపం.

ఇదీ చదవండి: Stress Management: ఒత్తిడిని అధిగమించడం ఎలా? ఈ టిప్స్ మీ కోసం

ఈరోజు ఊపిరితిత్తుల సమస్య ద్వారా ఆయాసం వచ్చేవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
ఊపిరితిత్తుల ద్వారా గాలి సరిగా ఆడకపోవడం వల్ల ఆయాసం వస్తుంది.గాలి తిత్తులు సాగిపోయి గాలి ఆడదు. రెండోది కఫం ఎక్కువగా ఉండటం వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. ఈ లక్షణాలు కూడా సీఓపీడీ సమస్యే. ఏ పనిచేయలేకపోవడం శక్తి క్షీణించడం జరుగుతుంది. దీన్ని తగ్గించుకోవడానికి మీ లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవాలి. ప్రతిరోజూ కాచి చల్లార్చిన నీరు తాగాలి. దీంతో కఫం బయటకు వెళ్లిపోతుంది.

వేపపుల్లను నమిలినా, రోజుకు రెండుసార్లు పసుపు లేదా యూకలిప్టస్ ఆయిల్ కలిపి వేడినీటితో ఆవిరి పట్టుకోవాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. ఆ వేడికి శ్వాసనాళాలు ఫ్రీ అయిపోతాయి.అంతేకాదు రోజూ రెండుసార్లు వేడినీటి స్నానం చేయాలి. 

సీఓపీడీ సమస్య ఉన్నవారు తేనె, నిమ్మకాయ కలిపిన నీరు తాగాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ సమస్య తగ్గుతుంది. ఓ గంట తర్వాత గ్లాసు నీళ్లు తాగాలి. రోజుకు రెండు మూడుసార్లు తేనె నిమ్మరసం తీసుకోవాలి.మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం తీపి పండ్లను తీసుకోవాలి. రోజుకు రెండుసార్లు తినాలి. ఉదయం వేడివేడి సూప్ తీసుకోవాలి.  ముఖ్యంగా ఉప్పు మానేస్తే శ్వాసనాళాలు బాగా సాగుతాయి, గాలి బాగా ఆడుతుంది.

ఇదీ చదవండి: Pregnancy Symptoms: ప్రెగ్నెన్సీ ఉన్నట్లు 100% కన్ఫర్మ్ చేసే లక్షణాలు ఇవే..!

సాయంత్రం చెరుకు రసం తాగితే కఫం, శ్లేష్మం వంటివాటికి దూరంగా ఉండొచ్చు. కమలపండ్లు కూడా తీసుకోవాలి. అంతేకాదు మీ డైట్లో మొలకలు నానబెట్టి తినాలి. సైరోమీటర్ ఊదుతుంటే కూడా లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. రోజూ రెండుపూటల ప్రాణాయామం చేయాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల మందులు లేకుండానే సీఓపీడీ సమస్య తగ్గిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News