High Blood Pressure Cholesterol: బీపీ, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే అద్భుతమైన చిట్కా ఇదే.. ఇలా చేయండి రోజు..

How To Cure High Blood Pressure Cholesterol: చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుని చెడు కొలెస్ట్రాల్‌ సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ చిట్కాను వినియోగించండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 05:23 PM IST
High Blood Pressure Cholesterol: బీపీ, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే అద్భుతమైన చిట్కా ఇదే.. ఇలా చేయండి రోజు..

How To Cure High Blood Pressure Bad Cholesterol In 3 Minutes: చాలా మంది చలికాలంలో వేయించిన, కొవ్వు పదార్ధాలను తినడానికి ఇష్టపడతారు. ఇలాంటివి తినడం నోటికి రుచిని ఇచ్చిన, ఆరోగ్యానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వేయించిన ఆహారాన్ని తినడం. శారీరక శ్రమను తగ్గించడం వంటి కొన్ని అలవాట్లు చలికాలంలో రక్తపోటు, శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీని వల్ల చాలా మంది గుండె సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలను పాటించడం వల్ల కూడా ఈ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

కొలెస్ట్రాల్ స్థాయిలు:
శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గుండె సిరల్లో ఫలకం పేరుకుపోయి తీవ్ర గుండె పోటుగా మారొచ్చు. దీని కారణంగా రక్త పోటు సమస్యలు కూడా వస్తాయి. అయితే శరీరంలో ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడమేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల గుండె కొట్టుకోవడంలో చాలా రకాల సమస్యలు రావోచ్చు.

ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఇలా చేయండి:
>>చలికాలంలో కొలెస్ట్రాల్‌ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పొగాకు, ఆల్కహాల్ వంటి వాటిని తీసుకోవడం మానుకోండి.
>> ప్రతి రోజూ ఆహారాల్లో ఆకుపచ్చని కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చలికాలంలో పచ్చి కూరగాయలను జ్యూస్‌లను కూడా తాగాల్సి ఉంటుంది.
>>గుండె జబ్బులకు దూరంగా ఉండడానికి తప్పకుండా వెల్లుల్లి ఆహారంలో వినియోగించాల్సి ఉంటుంది.
>> చెడు కొలెస్ట్రాల్‌ నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి అల్పాహారంలో నట్స్‌ని తీసుకోవాల్సి ఉంటుంది.
>>నాన్ వెజ్ తినేవారు చేపలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.
>>చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవడానికి తప్పకుండా ప్రతిరోజూ యోగా, వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు వ్యాయామాలు చేస్తే కొవ్వు తగ్గి, కొలెస్ట్రాల్, బీపీ అదుపులో ఉంటాయి.
>>ధ్యానం చేయడం వల్ల కూడా ఒత్తిడి తగ్గి గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Also Read : Gaalodu Movie Review : గాలోడు రివ్యూ.. సుధీర్ మాస్ యాంగిల్

Also Read : Masooda Movie Review : మసూద రివ్యూ.. భయపెట్టిన దెయ్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News