High Blood Pressure: ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా జీవితంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు అలవాట్ల కారణంగా శరీరంలోని కొలెస్ట్రాల్ పేరుకుపోయి కొంతమందిలో సులభంగా అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీని కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భారతదేశ వ్యాప్తంగా రోజురోజుకు అధిక రక్తపోటుతో బాధపడే వారి సంఖ్య రెట్టింపు అవుతుంది. కాబట్టి ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ వ్యాధితో బాధపడుతున్న వారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన సూచనలు, సలహాలు పాటించాల్సి ఉంటుంది.
స్కిమ్ మిల్క్:
అధిక రక్తపోటుతో బాధపడేవారు తప్పకుండా ప్రతిరోజు ఈ మిల్క్ ను తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే మెగ్నీషియం గుణాలు రక్తపోటుని నియంత్రించడమే కాకుండా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. రోజుకు ఒక గ్లాసు నుంచి రెండు గ్లాసుల చొప్పున స్కిమ్ మిల్క్ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
టమాటో రసం:
టమాటో రసంలో శరీరానికి కావాల్సిన అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రసం ప్రతిరోజు తాగడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా అధిక రక్త పోటు సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు 200 ml చొప్పున టమాటో రసం తాగాల్సి ఉంటుంది.
బీట్రూట్ రసం:
బీట్రూట్ రసంలో కూడా శరీరాన్ని కావలసిన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. కాబట్టి ఈ రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కూడా ఉంటాయి.
మందారం టీ:
మందారం టీ లో కూడా అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు ఈ టీని తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు సమస్య నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. బీపీ కారణంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఈ టీ ప్రతిరోజు తాగడం వల్ల దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.