High Cholesterol Foods: శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. ఇవి ఆ లక్షణాలే..!

High Cholesterol Foods: బరువు, నడుము వద్ద కొవ్వు పెరగడం అధిక కొలెస్ట్రాల్‌గా గుర్తించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా మనిషి లావుగా కనిపించడం కూడా కొవ్వు పెరుగుదల కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా చెడు కొవ్వు పెరుగుదల వల్ల మానవ శరీరానికి అనేక నష్టాలుంటాయని వైద్యులు పేర్కొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2022, 05:02 PM IST
  • శరీరంలో కొవ్వు పెరిగితే పాదాలలో సమస్యల
  • తప్పని సరిగా పలు జాగ్రత్తలు పాటించాలి
  • పాదాలలో అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు
High Cholesterol Foods: శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. ఇవి ఆ లక్షణాలే..!

High Cholesterol Foods: బరువు, నడుము వద్ద కొవ్వు పెరగడం అధిక కొలెస్ట్రాల్‌గా గుర్తించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా మనిషి లావుగా కనిపించడం కూడా కొవ్వు పెరుగుదల కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా చెడు కొవ్వు పెరుగుదల వల్ల మానవ శరీరానికి అనేక నష్టాలుంటాయని వైద్యులు పేర్కొన్నారు. చెడు కొలెస్ట్రాల్‌  మధుమేహం, గుండెపోటు వంటి సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు పాదాలలో కూడా కనిపిస్తాయని వైద్యులు తెలిపారు.

పాదాలలో అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు:

1. అడుగులు వేసినప్పుడు పాదలకు చలిగా అనిపించడం:
 
చలికాలంలో పాదాలకు చలి ఉండడం అనేది సర్వసాధారణం. కానీ ఎండాకాలంలో కూడా ఇలా జరిగితే.. శరీరానికి  ఏదో పెద్ద సమస్య జరగబోతుందని అర్థం చేసుకోవాలి. ఇది శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతమని నిపుణులు తెలిపారు.

2. పాదాల చర్మంలో రంగుల మార్పు:

అధిక కొలెస్ట్రాల్ కారణంగా పాదాలకు రక్త సరఫరాపై కూడా ప్రభావం పడుతుంది. దీని ప్రభావం పాదాలపై స్పష్టంగా కనిపిస్తుంది. రక్తం సరఫరా  వల్ల లేకపోవడం చర్మం, పాదాల గోళ్ల రంగు మారడం ప్రారంభమవుతుంది.

3. లెగ్ క్రాంప్స్:

రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు చాలా మందికి కాలు తిమ్మిరిగా ఉంటుంది. ఇది అధిక కొలెస్ట్రాల్ సంకేతమని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలోని కింది భాగంలో నరాలు దెబ్బతిన్నాయనడానికి సంకేతమని చెప్పవచ్చు.

4. పాదాలలో నొప్పి:

అధిక కొలెస్ట్రాల్ కారణంగా పాదాలకు రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడతాయి. అంతే కాకుండా తీవ్రమైన నొప్పి వస్తుంది. అటువంటి పరిస్థితులలో సాధారణ నడక సులభం కాదని నిపుణులు అంటున్నారు.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Sonakshi Sinha Engagement: వైరల్ ఫొటోస్.. ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో సోనాక్షి సిన్హా!

Also Read: Bread Biscuit Prices Hike India: సామాన్యులపై మరో భారం..పెరగనున్న ధరలు ఇవే..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News