High Protein Diet: వేసవిలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. అయితే చాలా మంది ప్రోటీన్ లోపాన్ని తగ్గించుకోవడానికి గుడ్డు, మాంసం, చేపలను తింటూ ఉంటారు. ఈ ఆహారాలు కేవలం మాంసాహారులు మాత్రమే తినగలుగుతారు. ఇక శాఖాహారుల విషయానికొస్తే ఈ కింద పేర్కొన్న ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల సులభంగా ప్రోటీన్ లోపం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
శాఖాహారులకు ప్రోటీన్స్ కలిగిన ఆహారాలు ఇవే:
పనీర్:
శాఖాహారులైతే తప్పకుండా ప్రోటీన్ లోపాన్ని నియంత్రించేందుకు ఆహారంలో తప్పకుండా పనీర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. 100 గ్రాముల పనీర్‌లో 18-20 గ్రాముల ప్రొటీన్లు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా దీనితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో ప్రోటీన్ లోపం తగ్గుతుంది.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
సోయాబీన్:
చైనీస్ వంటకాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. సోయాబీన్స్‌లో ప్రోటీన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. 100 గ్రాముల సోయాబీన్‌లో 36 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. కాబట్టి జిమ్ చేసేవారు వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి శరీర ఆకృతిని పొందవచ్చు.
వేరుశెనగ:
శరీరానికి ప్రోటీన్స్ తగ్గిన పరిమాణంలో అందడానికి ప్రతి రోజు వేరుశెనగను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. 100 గ్రాముల వేరుశెనగలో 25 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు వీటిని ఆహారంలో తీసుకుంటే శరీరం దృఢంగా మారుతుంది.
పల్స్:
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పప్పుధాన్యాలు సహాయపడతాయి. ఇందులో ప్రోటీన్స్ కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో ప్రోటీన్ సమస్యలు దూరమవుతాయి.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook