Home Remedies for Acidity: ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవనశైలి కారణంగా అనారోగ్యకరమైన ఆహారాలు తింటున్నారు. దీని కారణంగా పొట్ట సమస్యలతో పాటు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. చాలా మంది దీని కారణంగా పొట్ట సమస్యలతో పాటు ఎసిడిటీ బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే జీర్ణక్రియ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఎసిడిటీ సమస్య ఉన్నవారిలో గ్యాస్ట్రిక్ గ్రంథి ఎక్కువ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ సమస్య కొందరిలో మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం, అర్థరాత్రి వరకు మెలకువగా ఉండడం, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, వ్యాయామం లేకపోవడం కారణంగా కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్య కారణంగా కడుపులో మంట, పుల్లని త్రేనుపు, మలబద్ధకం సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎసిడిటీ బారిన పడిన కొంతమంది మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన మందులను కూడా అతిగా వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం మంచిదైనప్పటికీ..అతిగా వాడడం వల్ల తీవ్ర పొట్ట సమస్యలు రావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటికి బదులుగా కొన్ని ఇంటి చిట్కాలు పాటించి కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చు.
కొత్తిమీర విత్తనాలు:
కొత్తిమీర గింజలతో తయారు చేసిన నీటితో కూడా సులభంగా ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఈ హోమ్ రెమెడీని తయారు చేయడానికి రెండు చెంచాల కొత్తిమీర గింజలను నీటిలో నానబెట్టాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఉదయాన్నే ఈ నీటిని వడపోసి తాగాల్సి ఉంటుంది.
ఈ నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు శరీర బరువు కూడా నియంత్రిస్తాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఎండుద్రాక్ష:
నల్ల ఎండు ద్రక్ష నీరు కూడా పొట్టకు ప్రభావంతంగా సహాయపడతాయి.
ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
10 ఎండు ద్రాక్షలను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినాలి.
అందులో మిగిలిన నీటిని కూడా తాగొచ్చు.
ఇలా ప్రతి రోజు చేయడం వల్ల సులభంగా ఎసిడిటీ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి