ఇటీవలి కాలంలో ఆహారపు అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కడుపులో గ్యాస్ సమస్య ఇబ్బందిగా మారుతుంటుంది. ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంటుంది. వీటి వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తి..గ్యాస్ ఉత్పన్నం కావచ్చు. ఈ సమస్య నుంటి ఉపశమనం పొందాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సిందే
గ్యాస్ సమస్య-పాటించాల్సిన టిప్స్
1. గోరు వెచ్చని నీళ్లు
మీకు తరచూ గ్యాస్ సమస్య ఏర్పడుతుంటే ఇవాళ్టి నుంచి గోరు నెచ్చని నీళ్లు తాగే అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ తొలగించడం, నియంత్రించడం సులభమౌతుంది. గోరు వెచ్చని నీళ్లతో జీర్ణక్రియ సులభమౌతుంది. ఫలితంగా కడుపు సంబంధిత సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది.
2. వజ్రాసనం
గ్యాస్ సమస్య దూరం చేసేందుకు యోగాను ఆశ్రయించాల్సి ఉంటుంది. దీనికోసం వజ్రాసనం ముద్రలో కూర్చోవాలి. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాల వరకూ ఈ ఆసనం వేయాలి. జీర్ణక్రియ వ్యవస్థను పటిష్టం చేస్తుంది.
3. తినేటప్పుడు నోరు మూసుకోవడం
తినేటప్పుడు నోరు ఎక్కువగా తెరవడం మంచిది కాదు. దీని వల్ల కడుపులో గాలి చేరుకుంటుంది. అందుకే తినేటప్పుడు నోరు ముూసుకునే ఉండాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య దూరమౌతుంది.
4. హాట్ వాటర్ బ్యాగ్ వినియోగం
కడుపులో గ్యాస్ పరిమితికి మించి ఉంటే..హాట్ వాటర్ బ్యాగ్ తీసుకోవాలి. కడుపు వద్ద ఉంచుకుని..తేలిగ్గా మస్సాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ట్రైటిస్ సమస్య దూరమౌతుంది.
Also read: Dates Benefits: ఎండు ఖర్జూరం, వెట్ ఖర్జూరంలో ఏది ఆరోగ్యానికి మంచిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook