Amla Juice Remedies: ఉసిరి జ్యూస్ పరగడుపున తాగితే కలిగే అద్భుతాలివే

Amla Juice Remedies: చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. దీనికి ప్రధాన కారణం ఇమ్యూనిటీ తగ్గిపోవడమే. అందుకే చలికాలంలో లభించే కొన్ని పదార్ధాలతో ఈ సమస్యను అద్భుతంగా పరిష్కరించవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 23, 2024, 09:28 PM IST
Amla Juice Remedies: ఉసిరి జ్యూస్ పరగడుపున తాగితే కలిగే అద్భుతాలివే

Amla Juice Remedies: చలికాలంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే ముందుగా చేయాల్సింది ఇమ్యూనిటీ బలోపేతం చేయడం. శీతాకాలంలో బెస్ట్ హెల్తీ డ్రింక్ ఉసిరి జ్యూస్. ఉసిరి జ్యూస్ క్రమం తప్పకుండా తాగితే శరీరంలో అద్భుతమైన మార్పులు గమనించవచ్చు. వివిధ రకాల వ్యాధుల్నించి సంరక్షించవచ్చు. 

ఉసిరి జ్యూస్‌లో శరీరానికి అవసరమయ్యే అద్భుతమైన పోషకాలుంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఫైబర్ పెద్దఎత్తున నిండి ఉంటాయి. ఆరోగ్యపరంగా అద్భుతమైన లాభాలుంటాయి. ఉసిరి అనేది చలికాలంలో విరివిగా లభించే ఫ్రూట్. అందుకే ఈ సీజన్ అంతా వీలైనంతగా ఉసిరి జ్యూస్ రోజూ తాగితే చాలా రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పటిష్టం చేస్తుంది. ఇమ్యూనిటీ బలపడటంతో సీజనల్ ఇన్‌ఫెక్షన్లు, వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. ఉసిరి జ్యూస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. శరీర కణజాలానికి హాని కలగకుండా కాపాడుతుంది. 

ఉసిరి జ్యూస్ క్రమం తప్పకుండా రోజూ తాగడం వల్ల జీర్ణక్రియకు చాలా ఉపయోగమౌతుంది. కడుపు సంబంధిత సమస్యలైన మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ దూరం చేయవచ్చు. ఉసిరి జ్యూస్ తాగడం వల్ల ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది .ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉసిరి జ్యూస్ తాగడం వల్ల శరీరంలో మెటబోలిజం వేగవంతమౌతుంది. కొవ్వు కరిగించేందుకు దోహదం చేస్తుంది. శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు బెస్ట్ డ్రింక్ ఇది. ఉసిరి జ్యూస్ అనేది కేశాలకు చాలా మంచిది. సహజసిద్ధమైన ఔషధంలా పనిచేస్తుంది. కేశాల్ని పటిష్టం చేయడమే కాకుండా నిగారింపును తీసుకొస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఐరన్ కేశాల్ని పటిష్టం చేస్తుంది. హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. 

ఉసిరి జ్యూస్ చర్మ ఆరోగ్యానికి సైతం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మాన్ని డీటాక్స్ చేసి ముఖంపై ముడతలు, పింపుల్స్, మచ్చలు వంచి సమస్యలు దూరమౌతాయి. 1-2 ఉసిరి కాయల్ని తీసుకుని అందులో కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా నీరు పోసి మిక్స్ చేయాలి. రుచి కోసం కొద్దిగా తేనె, పింక్ సాల్ట్ కలుపుకుని తాగాలి. 

Also read: Weight Loss Remedies: రోజుకు రెండు సార్లు అనాస పూవు టీ తాగితే నెలరోజుల్లో వెయిట్ లాస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News