How Reduce Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ వెన్నలా కరగడానికి అద్భుతమైన చిట్కా ఇదే, నమ్మట్లేదా?

How Reduce Belly Fat 8 Days: బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు బెల్లం, సోంటి నీటిని తాగాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజూ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2023, 11:34 AM IST
How Reduce Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ వెన్నలా కరగడానికి అద్భుతమైన చిట్కా ఇదే, నమ్మట్లేదా?

How Reduce Belly Fat 8 Days: బరువు తగ్గడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. బరువు తగ్గడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గడం లేదు. అయితే చాలా మందిలో బరువు పెరగడమేకాకుండా బెల్లీ ఫ్యాట్‌ సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే డైట్‌ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల ఇంటి చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

బెల్లం, సోంటి బరువును ఎలా తగ్గిస్తాయో తెలుసా?:
శొంఠి శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. బెల్లం,  శొంఠి  ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి ఫైబర్ లభిస్తాయి. కాబట్టి ఈ రెండు మిశ్రమాలను ప్రతి రోజూ తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా బెల్లంలో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఎ ఇందులో లభిస్తాయి. ఇవి శరీర బరువును తగ్గించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది.

పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా తగ్గిస్తాయి:
బెల్లం, శొంఠి బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఈ రెండింటిలో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ వీటిని తీసుకుంటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. వీటి వల్ల సులభంగా శరీర మెటబాలిజం పెరుగుతుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని కొవ్వును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి అనారోగ్య సమస్యలో బాధపడేవారు తప్పకుండా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.

బరువు తగ్గడానికి బెల్లం-శొంఠి నీరు ఎలా తయారు చేయాలి:
ముందుగా ఒక గ్లాసు నీరు తీసుకోవాలి.
నీటిలో 1/2 టీస్పూన్ శొంఠి పొడిని వేయాల్సి ఉంటుంది.
మీరు దానిని రాత్రంతా పక్కన పెట్టాలి.
తర్వాత అందులో కొద్దిగా బెల్లం పొడి వేయాలి.
ఆ తర్వాత నీటిని వేడి చేసి వడకట్టి తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
కేవలం ఈ నీటిని ఖాళీ కడుపుతో తాగాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి : Jagtial Collector Yasmeen Basha: యాస్మీన్ భాషా చేతుల మీదుగా నర్సన్న పూజ.. హ్యాట్సాప్ కలెక్టర్

ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x