Dandruff: చుండ్రుతో బాధపడుతున్నారా..ఇటీవలి కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటోంది. బిజీ లైఫ్ కావచ్చు..ఆహారపు అలవాట్లు కావచ్చు. ఎన్ని మందులు వాడినా తగ్గని జటిలమైన సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలంటే..
బిజీగా మారిన దైనందిన జీవితంలో చుండ్రు (Dandruff) ఓ పెద్ద సమస్యగా మారింది. వైద్యుల వద్దకు వెళ్లినా..షాంపూలు మారుస్తున్నా ప్రయోజనం లేదనేది సర్వత్రా విన్పిస్తున్న మాట. ప్రతి ఒక్కరిలో ఈ సమస్య సర్వ సాధారణమైంది. రకరకాల చిట్కా వైద్యాలు ఉపయోగించి కూడా లాభం లేదని నిరుత్సాహపడుతుంటారు. మరి దీనికి పరిష్కారం లేదా. వంటింట్లో ఉండే పదార్ధాలతోనే చుండ్రు సమస్యను వదిలించుకోవచ్చంటున్నారు నిపుణులు. దీనికోసం మందులు వేసుకోవల్సిన అవసరం లేదని..షాంపూలు వాడాల్సిన పని లేదని అంటున్నారు. చేయాల్సిందేంటంటే..
ముందు కొబ్బరి నూనె..దానికి సమానంగా నిమ్మరసం (Lemon)తీసుకోవాలి. రెంటినీ కలిపిన మిశ్రమాన్ని స్నానానికి ముందు తలకు బాగా పట్టించాలి. 20-30 నిమిషాల తరువాత షాంపూతో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చాలు చుండ్రు సమస్య(Dandruff problem)నుంచి విముక్తి పొందవచ్చు. కొంతమంది రాత్రంతా తలకు పట్టించి ఉంచుతారు. అలా ఎప్పుడూ చేయకూడదు.
ఇంకో విధానం మెంతులు. మెంతుల్ని( Fenugreek seeds)రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ మెంతుల్ని పేస్ట్ చేసి తలకు బాగా పట్టించాలి. అరగంట అనంతరం స్నానం చేస్తే చుండ్రు పోతుంది. ఇది కాకుండా మరో విధానం ఉప్పు పద్దతి. ముందుగా తలను నీటితో తడుపుకోవాలి. అనంతరం సన్నటి ఉప్పుతో తలంతా మర్దనా చేసుకోవాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే చుండ్రు సమస్య వదిలిపోతుంది. ఇక మరో పద్ధతి కూడా ఉంది. ఉల్లిరసం, నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని తలకు రాసుకోవాలి. తల కుదుళ్లకు పట్టేలా మర్దనా చేసి కాస్సేపటి తరువాత తలస్నానం చేయాలి. వెంటనే తగ్గిపోతుంది.
Also read: COVID-19 Vaccine: కేంద్రం కీలక నిర్ణయం, 45 పైబడిన వారికి ఏప్రిల్ 1 నుంచి కరోనా టీకాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook