Black Fungus Symptoms: కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుండగానే..గోరుచుట్టుపై రోకలిపోటులా వచ్చి పడింది బ్లాక్ ఫంగస్. ప్రాణాంతకంగా మారిన బ్లాక్ ఫంగస్ ముఖ్యంగా కోవిడ్ రోగుల్ని టార్గెట్ చేస్తోంది. ఈ నేపధ్యంలో బ్లాక్ ఫంగస్‌ను ఎలా గుర్తించాలి..ఏం చేయాలనేదానిపై సమగ్ర వివరణ ఇదీ..
దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)విజృంభిస్తోంది. మరోవైపు బ్లాక్ ఫంగస్ విరుచుకుపడుతోంది. ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో ఎక్కువగా ఈ వ్యాధి కన్పిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. మహారాష్ట్రలో 90 మంది బ్లాక్ ఫంగస్ కారణంగా మరణించారు. రాజస్థాన్‌లో 100 కేసులు వెలుగు చూశాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రాణాంతకంగా మారుతున్న బ్లాక్ ఫంగస్‌ను (Black Fungus) ఎలా గుర్తించాలి, తీసుకోవల్సిన జాగ్రత్తలేంటి, ఏం చేయాలనేదానిపై ఎయిమ్స్ కొన్ని మార్గదర్శకాల్ని విడుదల చేసింది.
బ్లాక్ ఫంగస్ గుర్తించడం ఎలా ( How to Detect Black Fungus)
ముక్కు నుంచి రక్తం కారడం లేదా బ్లాక్ డిశ్చార్చ్ కావడం, ముక్కు దిబ్బడ, తలనొప్పి, కళ్ల చుట్టూ చర్మం ఉబ్బిపోయుండటం, కళ్లు ఎర్రబారడం, మసకగా కన్పించడం, కంటి చూపు తగ్గడం, కళ్లు తెరవడం, మూయడంలో ఇబ్బందులు ఎదురైతే బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా(Black Fungus Symptoms)చెప్పుకోవచ్చు. ముఖం తిమ్మిరిగా అన్పించడం, స్పర్శ కోల్పోయేలా ఉండటం, దవడలో నొప్పి, దంతాలు వదులుకావడజం, నోటి లోపలి భాగం ఉబ్బిపోయుండటం వంటివి ఇంకొన్ని లక్షణాలు.
బ్లాక్ ఫంగస్ లక్షణాలుంటే ఏం చేయాలి
బ్లాక్ ఫంగస్ లక్షణాలుంటే వెంటనే ఈఎన్టీ వైద్యుడిని లేదా కంటి వైద్యుడిని సంప్రదించాలి. మరీ ముఖ్యంగా చక్కెర వ్యాధి ఉన్నవాళ్లు షుగల్ లెవెల్స్ తప్పకుండా అదుపులో ఉంచుకోవాలి. వైద్యుడిని సంప్రదించకుండా స్టెరాయిడ్స్, యాంటీ ఫంగల్ మందులు వాడకూడదు. వైద్యుడి సూచన మేరకు పారానాసల్, సైనస్ టెస్టులు చేయించుకోవాలి.
బ్లాక్ ఫంగస్ వ్యాధి ఎక్కువగా ఆక్సిజన్ సపోర్టుతో, వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న కోవిడ్ పేషెంట్లకు వస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్(Diabetes)కంట్రోల్‌లో లేనివారు, స్టెరాయిడ్స్ తీసుకుంటున్న పేషెంట్లు, కేన్సర్ చికిత్స తీసుకుంటున్నవారు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలం టొకిలిజుమాబ్ ఇంజక్షన్ తీసుకున్నవారికి బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది.
Also read: Corona Third Wave: కరోనా థర్డ్ వేవ్ చిన్నారులకు ప్రమాదకరం, పిల్లలలో కరోనా కొత్త లక్షణాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook