Bloated Stomach Remedies: నయా పైసా ఖర్చు లేకుండా కడుపు ఉబ్బరాన్ని క్షణాల్లో తగ్గించే చిట్కాలు

Get rid of Bloated Stomach in Seconds: తరచుగా చాలా మంది పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి పది మందిలో ఆరుగురు కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 20, 2023, 07:20 PM IST
Bloated Stomach Remedies: నయా పైసా ఖర్చు లేకుండా కడుపు ఉబ్బరాన్ని క్షణాల్లో తగ్గించే చిట్కాలు

Get Rid of Bloating stomach in Just few Seconds: అతిగా అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల చాలా మందిలో పొట్ట సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు వేసవిలో రెట్టింపు అవుతాయి. దీని కారణంగా జీర్ణక్రియ కూడా దెబ్బతిని ఊబకాయం సమస్యలు కూడా రావొచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మందిలో కడుపు ఉబ్బరం సమస్యలు రావడం సర్వసాధరమైపోయాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తరచుగా మార్కెట్‌లో లభించే ఔషధాలు వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ కింది చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడుతున్నారా..?

పెరుగు, పుదీనా:
పెరుగు, పుదీనా ఆహారాల రుచి రెట్టింపు చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా వేసవిలో వీటిని తరచుగా ఆహారాలో వినియోగించడం వల్ల శరీరం చల్ల దనంగా మారుతుంది. అంతేకాకుండా జీర్ణ ఎంజైమ్‌లు చురుకుగా మారుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

తిన్న తర్వాత ఇలా చేయండి:
చాలా మందిలో ఆయిల్‌ ఫుడ్స్‌ అతిగా తీసుకోవడం వల్ల కడుపులో ఉబ్బరం సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తిన్న 30 నిమిషాల తర్వాత నిమ్మరసం తాగితే సులభంగా పొట్ట ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్

ఇసాబ్‌గోల్‌ని తీసుకోవాల్సి ఉంటుంది:
వేసవి కాలంలో చాలా మంది అపానవాయువు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారిలో లూజ్‌ మోషన్స్‌ కూడా అవుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఇసాబ్‌గోల్‌తో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. 

ఇంగువ కూడా పొట్టకు మేలు చేస్తుంది:
పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు తీసుకునే ఆహారాల్లో తప్పకుండా ఇంగువ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఇందులో జీర్ణక్రియకు మేలు చేసే చాలా రకాల మూలకాలు లభిస్తాయి. దీంతో పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News